AP News: ఏపీలో సామాన్యుడికి ఇసుక దొరకడంలేదు.. దేవినేని హాట్ కామెంట్స్!

ఏపీలో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేదని అన్నారు టీడీపీ నేత దేవినేని ఉమా. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన రూ.వేల కోట్లు తాడేపల్లి ఖజానాకు వెళ్లాయని ఆరోపించారు.

New Update
AP News: ఏపీలో సామాన్యుడికి ఇసుక దొరకడంలేదు.. దేవినేని హాట్ కామెంట్స్!

Devineni Uma: వైసీపీ (YCP) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ (TDP) నేత దేవినేని ఉమా. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే సామాన్యుడికి ఇసుక దొరకడం లేదని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద అక్రమ రవాణాను ఆపాలంటూ దేవినేని ఉమ నిరసన చేపట్టారు. ఫెర్రీ ఘాట్‌ వద్ద, లాంచీల రేవు వద్ద ఇసుక అక్రమ రవాణా ఆపాలని టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు.

టీడీపీ కౌన్సిలర్లు, నేతలతో కలిసి ఇసుక డంప్‌పై దేవినేని ఉమ బైఠాయించారు. మైనింగ్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డికి ఫోన్‌ చేసి వీడియోలు చూపించారు దేవినేని ఉమ. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేదని మండిపడ్డారు. అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన రూ.వేల కోట్లు తాడేపల్లి ఖజానాకు వెళ్లాయని ఆరోపించారు.

ALSO READ: BREAKING: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ!

ఎస్సీలపైనే ఎస్సీ వేధింపుల చట్టం: నక్కా ఆనంద్‌బాబు

గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఎస్సీ విభాగం సమావేశం అయింది. టీడీపీ కార్యాలయంలో భేటీకి టీడీపీ, జనసేన ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎస్సీలపై దాడులను వైసీపీ జన్మహక్కుగా భావిస్తున్నారని నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. ఎస్సీలపై అత్యాచారం, దౌర్జన్యాలు నిత్యం జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలపైనే ఎస్సీ వేధింపుల చట్టం పెట్టే దుస్థితి ఏపీలోనే ఉందని అన్నారు.

ALSO READ: డబ్బుల కట్టడిలో నిర్లక్ష్యం.. ముగ్గురు పోలీసు అధికారులు ఔట్

Advertisment
Advertisment
తాజా కథనాలు