Hero Vishal: ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం లేదు..కానీ భవిష్యత్తులో రావొచ్చు!

విశాల్ ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చిచెప్పారు. అయితే అవసరమైతే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయని విశాల్‌ తెలిపారు.భవిష్యత్తులో ప్రకృతి వేరే విధంగా నిర్ణయం తీసుకుంటే,వారిలో ఒకడిగా ప్రజల కోసం గొంతు విప్పడానికి వెనుకాడను"అని చెప్పారు

New Update
Hero Vishal: ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం లేదు..కానీ భవిష్యత్తులో రావొచ్చు!

Actor Vishal: తమిళ సినీ నటుడు విశాల్ ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చిచెప్పారు. అయితే అవసరమైతే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయని విశాల్‌ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకదానిని విశాల్‌ సోషల్ మీడియాలో విడుదల చేశాడు.

'' నేను ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించలేదు. ప్రజలకు సేవ చేయడంలోనే నా సంతోషాన్ని వెదికాను'' అంటూ విశాల్‌ ఆ వీడియోలో వెల్లడించాడు. భవిష్యత్‌లో పరిస్థితులు మారితే ప్రజల పక్షాన నిలబడేందుకు సిద్ధమని కూడా ఆయన స్పష్టం చేశారు. "భవిష్యత్తులో ప్రకృతి వేరే విధంగా నిర్ణయం తీసుకుంటే, నేను వారిలో ఒకడిగా ప్రజల కోసం గొంతు విప్పడానికి వెనుకాడను" అని 'విశాల్‌ అన్నాడు.

విశాల్‌ తెలుగు, తమిళంలో సినిమాలు చేసి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా విశాల్‌ మొదటి నుంచి కూడా అభిమాన సంఘాలను సంక్షేమ ఉద్యమంగా మార్చడాన్ని హైలైట్ చేశాడు.అతను తన తల్లి పేరు మీద స్థాపించిన "దేవి ఫౌండేషన్" ద్వారా విద్యా సహాయంతో పేదవారికి విద్యను అందించడానికి పాటుపడుతున్నాడు.

2017లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో చెన్నైలోని ఆర్‌కె నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో పోరాడేందుకు ప్రయత్నించిన విశాల్ రాజకీయ ఆశయాలు నెరవేరలేదు. ప్రిసైడింగ్ అధికారి ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు.

కొద్దిరోజుల క్రితం నటుడు విజయ్‌ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో మరి కొద్ది రోజుల్లో విశాల్‌ కూడా కొత్త పార్టీతో రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాల్‌ సోషల్‌ మీడియాలో వీడియోతో క్లారిటీ ఇచ్చాడు.

Also read: వాలెంటైన్స్‌ వీక్‌ గులాబీలతో ఎందుకు మొదలవుతుందో తెలుసా!

Advertisment
Advertisment
తాజా కథనాలు