Cotton Cnady: ఆ రాష్ట్రంలో పీచు మిఠాయిపై నిషేధం.. ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం పీచు మిఠాయిపై నిషేధం విధించింది. పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు పరిశోధనల్లో తెలిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. By B Aravind 17 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి చాలామంది కాటన్ క్యాండీ (పీచు మిఠాయి)ని ఇష్టపడతారు. బయటకు వెళ్లినప్పుడు రోడ్డు పక్కన కనిపించే ఆ పీచు మిఠాయిని చూసి దాన్ని తినకుండా ఉండలేరు. అయితే తాజాగా తమిళనాడు ప్రభుత్వం వీటిపై కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ ఈ విషయాన్ని వెల్లడించారు. పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు పరిశోధనల్లో తెలిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. Also Read: బాణాసంచా తయారీ కార్మాగారంలో పేలుడు.. 10 మంది మృతి.. కృత్రిమ రంగుల కోసం ఇదిలాఉండగా.. పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు ఇటీవల ఆహార భద్రత విభాగం అధికారులు చైన్నైలో తనిఖీలు చేపట్టారు. ఇందులో స్వాధీనం చేసుకున్న నమూనాలను అధ్యయనం చేయగా.. పీచు మిఠాయిల్లో రోడమైన్-బి అనే రసాయనం ఉన్నట్లు గుర్తించారు. అయితే కృతిమ రంగుల కోసం ఈ కెమికల్‌ను పీచు మిఠాయిల్లో వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా.. ఈ రోడమైన్ - బిని 'ఇండస్ట్రియల్ డై'గా పిలుస్తారు. దీన్ని ఎక్కువగా.. బట్టలకు కలర్ వేసేందుకు అలాగే పేపర్ ప్రింటింగ్‌లో కూడా వినియోగిస్తారు. రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అయితే ఫుడ్ కలరింగ్ కోసం మాత్రం ఈ రసాయనాన్ని వినియోగించే అవకాశం లేదు. దీనివల్ల దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎక్కువ మోతాదులో ఇది శరీరంలోకి వెళ్తే.. లివర్, కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. అంతేకాదు దీనివల్ల అల్సర్ వంటి సమస్యలతో సహా.. క్యాన్సర్‌కు కూడా దారితీసే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించింది. ఇకనుంచి వీటి తయారీలు, విక్రయాలు చేపడితే.. కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ హెచ్చరించారు. Also Read: రాహుల్- ప్రియాంక మధ్య గొడవలు.. అందుకే రాలేదు: బీజేపీ #telugu-news #tamil-nadu #national-news #cotton-candy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి