Turmeric: పసుపును ఈ ఆహారాలతో కలిపి తీసుకోవద్దు..ఎందుకంటే!

కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో పసుపు కలపడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారంలో పసుపు, పసుపు ఎక్కువగా తీసుకున్న జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు వేసి ఉదయం తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

New Update
Turmeric: పసుపును ఈ ఆహారాలతో కలిపి తీసుకోవద్దు..ఎందుకంటే!

Turmeric: పసుపును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పసుపును సరైన ఆహారంతో మాత్రమే తీసుకోవాలని, లేకుంటే అందులోని ఔషధ గుణాలు నాశనం అవుతాయని నిపుణులు అంటున్నారు. పసుపు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిని మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. కొందరు నీళ్లలో పసుపు కలుపుకుని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగుతారు. అదేవిధంగా కొందరు పసుపును పాలలో కలిపి తాగుతారు. అయితే కొన్ని ఆహార పదార్థాలలో పసుపు చేర్చడం ఆరోగ్యానికి మంచిది కాదు.

పాల ఉత్పత్తులు:

  • పాలు, పెరుగులో చాలా మంది పసుపు కలుపుతారు. అయితే, క్యాల్షియం ఉన్న పాల ఉత్పత్తులకు పసుపు కలపడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పసుపులో ఉండే కర్కుమిన్ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే పాల ఉత్పత్తులలో కాల్షియం ఉంటుంది. ఇది కర్కుమిన్‌ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

ఐరన్‌ ఉన్న ఆహారం:

  • ఐరన్ మన శరీరానికి అవసరమైన పోషకం. ఐరన్‌ ఉంటేనే రక్తహీనత వంటి వ్యాధులు దరిచేరవు. అయితే ఐరన్ ఉన్న ఆహారంలో పసుపు వేయకూడదని అంటున్నారు. ఎందుకంటే ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాల్లో పసుపును కలుపుకుంటే పసుపులోని కర్కుమిన్ శరీరంలోకి చేరకుండా చేస్తుంది. కాబట్టి బచ్చలికూర, ఉసిరి వంటి ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు అందులో పసుపు వేయకుండా చూసుకోవాలి.

మిరియాలు:

  • కొందరు పాలలో పసుపు, మిరియాలు కలుపుతారు. మిరియాలలో పెప్పరైన్ అనే పదార్ధం కర్కుమిన్‌ను మన శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది.

వీటిలో పసుపు కలపకూడదు:

  • కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో పసుపు కలపడం మంచిది కాదు. ఎందుకంటే వీటిలో పసుపు కలపడం వల్ల శరీరానికి ఉపయోగం ఉండదు. అలాగే అతిగా ప్రాసెస్ చేసిన ఆహారంలో పసుపు కలపడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పసుపు ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

ఇలా తీసుకుంటే మంచిది:

  • చిటికెడు పసుపును ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు వేసి ఉదయం తాగవచ్చు. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే అన్నంలో పసుపు వేసి వండుకోవచ్చు. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: పిల్లలకు ఏ వయసులో చెవులు కుట్టించాలి?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు