TSPSC: గ్రూప్-2 వాయిదా.. ఏ క్షణమైనా నిర్ణయం?
టీఎస్పీఎస్సీ ఉద్యోగార్థుల నిరీక్షణకు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షపై సందిగ్ధం నెలకొంది. ఇంకా పదిరోజులే మిగిలున్నప్పటికీ పరీక్ష నిర్వహణ కోసం కమిషన్ ఏర్పాట్లేవీ చేయకపోవడంతో మరోసారి వాయిదా పడే అవకాశాలే కనిపిస్తున్నాయి.