ఆంధ్రప్రదేశ్ Bear spotted at Srivari Mettu: తిరుమలలో ఎలుగు బంటి కలకలం.. భయాందోళనలో భక్తులు శ్రీవారి మెట్ల మార్గంలో సోమవారం 2000వ మెట్టు వద్ద భక్తులు ఎలుగు బంటి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. ఎలుగు బంటిని కొందరు భక్తులు తమ సెల్ ఫోన్ లలో ఫొటోలు తీసి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అధికారులు మెట్ల మార్గానికి చేరుకుని, పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నారు. ఎలుగు బంటి సంచారం ఎక్కువైన నేపథ్యంలో టీటీడీ అలర్ట్ అయ్యింది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించడం లేదు. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలను సైతం నిషేధించింది. అంతేకాకుండా నడకమార్గాల్లో చిన్నారుల చేతులకు ట్యాగ్ లు కడుతున్న సంగతి తెలిసిందే. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Prasanna Kumar : లక్షిత తల్లిదండ్రుల మీద అనుమానం ఉంది..వైసీపీ ఎమ్మెల్యే! తిరుమల అలిపిరి దారిలో చిన్నారి లక్షిత మృతి పై నెల్లూరు జిల్లా కోవూరు వైసీసీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు చిన్నారి మృతి వెనుక తల్లిదండ్రుల మీద అనుమానం ఉందంటూ పేర్కొన్నారు. By Bhavana 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ లో పొగలు..కారణం ఏంటంటే! Smoke in Tirupati-Secunderabad Vande Bharat Express: బుధవారం సాయంత్రం తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో ఓ బోగీలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులందరూ ఆందోళన చెందారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం సాయంత్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మునబోలు సమీపంలోకి రాగానే రైలులోని ఒక బోగీలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. By Bhavana 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్రావు దంపతులు తిరుపతి జిల్లాలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala)శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ మంత్రి హరీష్రావు (Minister Harish rao) దంపతులు దర్శించుకున్నారు. నేడు (సోమవారం) వేకువజామున తిరుమల చేరుకున్న హరీష్ దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. By Vijaya Nimma 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn