🔴Live News: సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెండ్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కాషాయ బుక్ రాస్తామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం, ఆయన సలహాదారులు, బంధుమిత్రులు పైరవీలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
రాహుల్ గాంధీ కులం, మతం, జాతి లేనివాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాతా ముస్లీం, తల్లి క్రిస్టియన్ అయినా రాహుల్ గాంధీ బ్రహ్మాణుడని చెప్పుకుంటున్నాడన్నారు. హిందూ BCలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇస్తే కేంద్రం రిజర్వేషన్‌కు సహకరిస్తుందని సంజయ్ చెప్పాడు.
తెలంగాణ నీటిని ఏపీ సర్కార్ తరలించుకుపోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఏపీ ప్రభుత్వం గండి కొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు.
కొంతమంది తనపై అబద్ధపు ప్రచారాలు చేసి, పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను కొందరికి నచ్చకపోవచ్చని.. మరి కొందరు తనను అంగీకరించకపోవచ్చన్నారు. ఎవరు ఏమనుకున్నా తాను పట్టించుకోనన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బుక్ పాలిటిక్స్ ట్రెండ్ నడుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులకు కొన్ని కలర్ బుక్స్ పేరు చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. అక్రమ కేసులు, దౌర్జన్యాలకు పాల్పడినవారి పేర్లు రెడ్, బ్లాక్, గ్రీన్, గుడ్, పింక్ బుక్‌ల్లో రాసుకుంటామని నేతలు అంటున్నారు.