బీసీ జనగణన అని మభ్యపెట్టాలని చూస్తున్నారు.!
బడుగు బలహీన వర్గాలను వైసీపీ అణగదొక్కుతుందన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. 34% ఉన్న బీసీలకి వైసీపీ 24% రాజకీయ రిజర్వేషన్ తగ్గించిందని..మళ్లీ ఇప్పుడు బీసీ జనగణన అని మభ్యపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.
బడుగు బలహీన వర్గాలను వైసీపీ అణగదొక్కుతుందన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. 34% ఉన్న బీసీలకి వైసీపీ 24% రాజకీయ రిజర్వేషన్ తగ్గించిందని..మళ్లీ ఇప్పుడు బీసీ జనగణన అని మభ్యపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.
టీడీపీ, జనసేన మేనిఫెస్టోకు సంబంధించి ఈ రోజు ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. మొత్తం 11 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని యనమల రామకృష్ణుడు తెలిపారు.
టీడీపీ, జనసేన జేఏసీ సభ్యులు ఈరోజు సమావేశం కానున్నారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరగనుంది. మరికాసేపట్లో ఇది ప్రారంభం కానుంది.
టీడీపీ నేత కిలారు రాజేశ్ ను గుర్తు తెలియని దుండగుడు వెంబడించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేశ్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జగన్ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై కక్ష గట్టి అక్రమంగా కేసులు పెడుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఫిర్యాదు చేశారు. మొత్తం 60 వేల కేసులు పెట్టారని వివరించారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి మాట్లాడుతున్నారా లేక తన బావ చంద్రబాబు ఉనికిని కాపాడాటానికి ఆమె మాట్లాడుతున్నారా అంటూ బాపట్ల ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు ప్రశ్నించారు.
కాసేపట్లో నారా లోకేష్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. చంద్రబాబు మీద ఉన్న కేసుల గురించి ఆయన న్యాయనిపుణులతో చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా ఈరోజు విజయవాడ నుంచి హైదరాబాద్ కి వైద్య పరీక్షల నిమిత్తం రానున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ వచ్చిన క్రమంలో ఆయన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ క్రమంలో ఆయనను రాజమండ్రి నుంచి విజయవాడ వరకు భారీ ఊరేగింపుగా తీసుకుని వెళ్లేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
వైసీపీ నాయకులకు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. 'వైసీపీ నాయకులు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రానికి ఎంతో మంచి చేసిన చంద్రబాబు నాయుడునే జైలుకు పంపించినప్పుడు భవిష్యత్లో మీ పరిస్థితి ఏంటన్నది ఊహించుకోవాలి. ముఖ్యంగా ధర్మవరంలో అరాచకాలు చేస్తున్న వారు.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించి మసులుకోవాలి.' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.