Suicide: కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఒంటిపై 500లకు పైగా గాయాలు
ఉత్తరప్రదేశ్లోని ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఆమె మృతదేహంపై 500లకు పైగా గాయాల గుర్తులు ఉండటం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. గురువారం తన గదిలో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. ఆమె కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. పోస్టు మార్టం నివేదికలో ఆమె ఒంటిపై 500లకు పైగా గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. అయితే ఆమెకు మరో కానిస్టేబుల్ యువకునితో ప్రేమ సంబంధం ఉండేదని స్థానికులు తెలిపారు. అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవండంతో.. ఈమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.