TVK Vijay: TVK విజయ్ కు బిగ్ షాక్.. విడాకులు కావాలని కోర్టుకెక్కిన భార్య!
ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ భార్య సంగీత కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన నుండి విడాకులు కోరుతూ ఆమె ఈ రోజు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ భార్య సంగీత కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన నుండి విడాకులు కోరుతూ ఆమె ఈ రోజు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
స్టాలిన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు నార్త్ చెన్నైలోని ఓ నియోజకవర్గం నుండి విజయ్ పోటీ చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ ప్రాంతం దశాబ్దాలుగా డీఎంకే నిర్లక్ష్యానికి గురైందని, అభివృద్ధిలో వెనుకబడిందని టీవీకే పార్టీ నమ్ముతోంది.
తమిళనాడు కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలను నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ వ్యక్తిగతంగా కలవనున్నారు. కరూర్ పర్యటనకు అనుమతి లభించకపోవడంతో, బాధితుల కుటుంబాలను చెన్నై సమీపంలోని మామళ్ళపురంలో ఉన్న ఓ రిసార్ట్‌కు రప్పించి ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
కరూర్ రోడ్ షో తొక్కిసలాట టీవీకే పార్టీ అధిపతి విజయ్ కు పీడకలగా మారింది. దీని తరువాత ఆయనకు వరుసపెట్టి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా విజయ్ మరోసారి రోడ్ షో చేస్తే ఇంటిని పేల్చేస్తానంటూ కన్యాకుమారి నుంచి ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు హీరో విజయ్ కరూర్ ర్యాలీ తొక్కిసలాట ఘటన బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు.
తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 30 కి చేరింది. పదుల సంఖ్యలో పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ప్రముఖ నటుడు, TVK పార్టీ అధినేత విజయ్ దళపతిపై కేసు నమోదైంది. మదురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో విజయ్ అభిమాని ఆయన్ని కలిసేందుకు దగ్గరకి వెళ్లాడు. ఈక్రమంలో విజయ్ బౌన్సర్లు శరత్‌కుమార్ అనే వ్యక్తిపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు.
తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ చీఫ్ విజయ్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తొక్కిలాట జరిగింది. మధురైలో ఏర్పాటు చేసిన ఈ సభకు భారీ ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.
తమిళగ వెట్రి కళగం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ వ్యవస్థాపకులు విజయ్‌ని ఎన్నుకున్నట్లు ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని గతంలోనే స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు.