Shabbir Ali : బిగ్ షాక్.. షబ్బీర్ అలీకి AICC షోకాజ్ నోటీసులు!
తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఉద్దేశించినట్లుగా చెబుతున్న ఒక వివాదాస్పద ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధిష్టానం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.
Shabbir Ali: కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీగా మారింది: మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన ఆడియో లీక్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధిష్ఠానం లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అమ్ముడుపోయే పార్టీగా తయారైందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy: 'రేవంత్‌ను చంపేందుకు కుట్ర'
TG: కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జన్వాడ ఫాంహౌస్ వాస్తవాలు బయటపెట్టినందుకు నాడు ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డిని 40 రోజులు జైల్లో వేసి.. అండర్‌ట్రయల్ ముద్దాయిగా ఉంచి.. చంపాలని చూశారని ఆరోపించారు.
Ramzan 2024: షబ్బీర్ అలీ నివాసంలో రంజాన్ వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ముస్లింలందరికీ ముఖ్యమంత్రి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్షించారు.
ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాల సలహాదారు షబ్బీర్ అలీ 6 గ్యారంటీలు 100 డేస్ రివ్యూ మీటింగ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాల సలహాదారు షబ్బీర్ అలీ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎస్సి, ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాల డిక్లరేషన్, 6 గ్యారంటీలు 100 డేస్ లో ఎలా పూర్తి చేయాలి అనే అంశం పై రివ్యూ చేస్తున్నామని వెల్లడించారు
కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాద్‌లో చెల్లుతుందా!: కేటీఆర్ సెటైర్
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది బీజేపీకే ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ ఖిల్లా రోడ్డులో రోడ్డు షో కేటీఆర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. బీఆర్ఎస్ బీజేపీతో ఎప్పుడూ జత కట్టలేదని, భవిష్యత్తులో కూడా ఆ పార్టీతో దూరంగానే ఉంటామని అన్నారు.
Kamareddy: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై పోటీ.. షబ్బీర్ అలీ సంచలన ప్రకటన
ఈ సారి కూడా తాను కామారెడ్డి నుంచే పోటీ చేస్తున్నట్లు మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. తాను నియోజకవర్గం మారున్నట్లు జరిగిన ప్రచారం బీఆర్ఎస్ పార్టీ పనేనంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ కామారెడ్డికి ఓ పొలిటికల్ టూరిస్ట్ అంటూ ఎద్దేవా చేశారు.
/rtv/media/media_files/2026/06/13/shabbir-ali-2026-06-13-14-22-48.jpg)
/rtv/media/media_files/2026/06/11/shabbir-ali-2026-06-11-17-41-52.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Revanth-reddy-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Ramzan-2024-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-33-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-100-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/CM-KCR-Kamareddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-08T204202.009-jpg.webp)