Road Accident: పండుగ పూట విషాదం.. ముగ్గురు యువకులు సజీవదహనం
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఆస్తి కోసం ప్రియుడితో భర్తను హత్య చేయించిందో మహిళ. హత్య అని అనుమానం రాకుండా ఉండేందుకు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసింది. కానీ, పోలీసుల విచారణలో అది హత్యగా తేలడంతో కటకటాలపాలయింది. గుంటూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో కొందరికి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
UPలోని ఉన్నావ్ జిల్లా లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పక్కరోడ్డులోకి వెళ్లి బ్యారియర్లు ఏర్పాటు చేస్తున్న నలుగురు ఉద్యోగులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
దసరా సెలవుల కోసం ఆనందంగా ఇంటికి బయలుదేరిన ఇద్దరి యువకుల జీవితం విషాదకరంగా ముగిసింది. ఇంటికి చేరేలోపే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బైక్ పై స్వగ్రామానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా డివైడర్‌ను కారు ఢీకొట్టినడంతో కారులో ఉన్న బావ, మరదలు ఇద్దరూ స్పాట్లోనే చనిపోయారు. మృతులను బీరం రంజిత్ రెడ్డి, హారిక రెడ్డిగా గుర్తించారు.
మొబైల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు (పోర్న్) చూస్తూ డ్రైవింగ్ చేసిన ఓ ట్రక్ డ్రైవర్, కారును ఢీకొట్టాడు. ఆ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించాడు. ఈ దారుణ ఘటన యూకేలోని లాంకాషైర్‌లో చోటుచేసుకుంది. నీల్ ప్లాట్ ట్రక్కును నడుపుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
గుంటూరు పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. టూరిస్టు బస్సు అదుపు తప్పి పంట కాల్వలోకి వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ పై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యారెడ్డి మృతిచెందగా.. మరో ఏడుగురు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.