Live Updates🔴: ముగిసిన పోలింగ్.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం!
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే ఛాన్స్ ఇంకా ఉంది. సాయంత్రం 5గంటలు దాటిన తర్వాత కొత్తగా బూత్ లకు వస్తున్నవారిని అనుమతించడంలేదు పోలీసులు.
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే ఛాన్స్ ఇంకా ఉంది. సాయంత్రం 5గంటలు దాటిన తర్వాత కొత్తగా బూత్ లకు వస్తున్నవారిని అనుమతించడంలేదు పోలీసులు.
నిన్నటి వరకూ ప్రచారలతో తెలంగాణను చుట్టుముట్టేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు దేవాలయాల చుట్టూ తిరిగేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న గుళ్ళన్నిటికీ వరుసపెట్టి వెళ్ళి వస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన మార్క్‌ను చూపించారు. రాష్ట్రవ్యాప్తంగా 63 నియోజకవర్గాల్లో 87 సభలు నిర్వహించి దుమ్ము లేపారు. తాను పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలైన కొడంగల్, కామారెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా టీపీసీసీ చీఫ్ హోదాలో ప్రచారం నిర్వహించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని అన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు.
తెలంగాణను బీఆర్ఎస్ విధ్వంసం చేసిందని; రాష్ట్ర పునర్నిర్మాణం, సమస్యలన్నిటికీ పరిష్కారం సోనియాగాంధీ నేతృత్వంలోని ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో వీడియో షేర్ చేశారు.
టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్. రైతు బంధు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్ లేఖ రాశారని ఆరోపించారు. రేవంత్ కాదు.. రేటెంత రెడ్డి అని సెటైర్లు వేశారు.
రైతుబంధును కాంగ్రెస్ అడ్డుకుందనే ఆరోపణలపై రేవంత్ రెడ్డి స్పందించారు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు జారీ చేసిందన్నారు. పది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు భరోసాగా రూ.15 వేలు ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు జగన్, నిధులు మెఘా కృష్ణారెడ్డి, నియామకాలు కేసీఆర్ ఇంటి పాలు అయ్యాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. డిసెంబర్ 3 తర్వాత రానున్న ఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామన్నారు.
మా స్ట్రాటజీ కేవలం డెవల్ మెంట్ మాత్రమే...అందుకే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి. బీజేపీ, కాంగ్రెస్ వంటి 420గాళ్లకు తనను ఓడించేంత సీన్ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.