Ap Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు..!
ఏపీలో మరోసారి వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలో మరోసారి వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఢిల్లీని శుక్రవారం సాయంత్రం గాలి దుమారం వణికించింది. దుమ్ము, ధూళి సృష్టించిన బీభత్సానికి జనం అల్లాడిపోయారు. ప్రజారవాణా స్తంభించిందిపోయింది. అలాగే, విమానాల రాకపోకలపై కూడా ఇది ప్రభావం చూపింది.
ఏప్రిల్ 12న తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు అధికారులుఎల్లో అలర్ట్ జారీ చేశారు.రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు
ఆంధ్రప్రదేశ్లో గురువారం పలు జిల్లాలలో వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురు, శుక్రవారం పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు బుధ, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది.
రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.
బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 10, 11.12,13 తేదీల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.