Odisha : ఒడిశాలో మోదీ పర్యటన..కాషాయమయం అయిన రోడ్లు
తెలుగు రాష్ట్రాలతో పాటూ ఒడిశాలో కూడా మే 13నే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మురం చేసింది. ఇందులో బాగంగా ఈరోజు ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించనున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటూ ఒడిశాలో కూడా మే 13నే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మురం చేసింది. ఇందులో బాగంగా ఈరోజు ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించనున్నారు.
తెలంగాణలో RR ట్యాక్స్‌పై చర్చ జరుగుతోందని అన్నారు మోదీ. RR ట్యాక్స్ పై తాను ఎవరు పేరు చెప్పలేదని.. కానీ సీఎం రేవంత్ భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. RR కాదు RRR ట్యాక్స్ నడుస్తోందని.. మూడో R అంటే రజాకార్ ట్యాక్స్ అని పేర్కొన్నారు.
భారతదేశంలో హిందువుల విశ్వాసాన్ని తొలగించడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీ. బీజేపీ కేవలం మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని అన్నారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు.
రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు రాహుల్. మోదీ గత పదేళ్లుగా దేశ సంపదనంతా అంబానీ, అదానీల చేతిలో పెట్టారని విమర్శించారు. వారికి మోదీ రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని పేర్కొన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా లేకుండా చేసినందుకు మోదీ క్షమాపణ చెప్పి రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. జగన్ దత్తపుత్రుడు చేసిన అవినీతి మోదీకి ఇంతకాలం కనపడలేదా? అని ప్రశ్నించారు. భారతి స్ట్రాటాజీ అందరినీ గొడ్డలితో చంపడమేనా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
భారతీయులు శరీరరంగు దక్షిణాఫ్రికాలతో పోలి ఉంటుంది అన్న కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి తెగ మీమ్స్ కూడా వస్తున్నాయి.
శరీర రంగు మీద కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఖండించారు. ఇది జాతి వివక్ష కిందకే వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటున్నారంటూ ప్రతిపక్ష పార్టీపై మండిపడ్డారు.
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏర్పడడం కమలనాథులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2014లో మోదీ పీఎం అయిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వానికి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడలేదన్న చర్చ సాగుతోంది.
కరీంనగర్లో ఈసారి బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ విజయం పక్కా అనిపిస్తోంది అన్నారు ప్రధాని మోదీ. బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. అంతకుముందు వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.