BIG BREAKING: ఇండియన్ ఆర్మీయే మా టార్గెట్.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన ప్రకటన
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఇండియన్ ఆర్మీనే టార్గెట్‌గా చేసుకుంటుందని ప్రకటించారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఇండియన్ ఆర్మీనే టార్గెట్‌గా చేసుకుంటుందని ప్రకటించారు.
జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహర్ డ్యామ్, అలాగే సలాల్ డ్యామ్ గేట్లను అధికారులు తెరిచారు. ఇటీవలే సింధూ నది ఒప్పందం నిలిపివేయండంతో ఆ డ్యామ్ గేట్లను మూసేశారు.
భారత్, పాక్ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాహోర్‌పై దాడులు జరిగే అవకాశం ఉండటంతో తమ పౌరులు, రాయబారులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది. స్థానిక అధికారుల నుంచి సహాయం తీసుకోవాలని సూచించింది.
పాక్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత వాయుసేన సంచలన నిర్ణయం తీసుకుంది. అంతరిక్ష యాత్ర వెళ్లేందుకు శిక్షణ తీసుకుంటున్న గగన్‌యాన్ వ్యోమగామి అజిత్ కృష్ణన్‌ను వెనక్కి పిలిపించింది. యద్ధ విమానాలు నడపడంలో అజిత్ కు చాలా అనుభవం ఉంది.
పాకిస్థాన్‌పై ఇండియన్ ఆర్మీ మళ్లీ దాడులకు దిగింది. లాహోర్, కరాచీ, రావల్పిండి సహా 9 నగరాలపై డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది.
కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని తెలిపింది. ఆపరేషన్ సిందూర్‌పై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఆ అకౌంట్లు బ్లాక్ చేయాలని ఆదేశించింది.
భారత్‌లో చొరబాటుకు యత్నించిన ఓ పాకిస్థాన్ వ్యక్తిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపేశారు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. చీకటిని ఆసరాగా చేసుకుని బార్డర్ దాటలని ప్రయత్నించడాన్ని గమనించిన బీఎస్ఎఫ్ కాల్పులు జరిపారు.
ఇండియన్ ఆర్మీ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన యూట్యూబర్ అన్వేష్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు చూడ్రా.. ఇండియా ఆర్మీ దెబ్బ ఎలా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే దేశం నుంచి తరిమికొడతామని హెచ్చరిస్తున్నారు.