Chalasani Srinivas: ఏపీ విషమ పరిస్థితుల్లో ఉంది
ఆంధ్రప్రదేశ్ విషమ పరిస్థితుల్లో ఉందని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లాలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన గురించి చర్చించారు.
"వన్ నేషన్.. వన్ ఎలక్షన్" పై ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే..!!
వన్ నేషన్,వన్ ఎలక్షన్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. సరైన ఉద్దేశ్యంతో అమలు చేస్తే దేశానికి మేలు జరుగుతుందన్నారు. అంతా సరిగ్గా జరిగితే 4నుంచి 5ఏళ్ల పరివర్తన దశ ఉంటే అది దేశ ప్రయోజనాలకు మేలు చేస్తుందన్నారు.
PM Modi: ఈ నెల 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తాం
ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్ట్ 29న తెలుగు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వారసత్వ భాషల్లో తెలుగు కూడా ఒకటన్నారు. మరోవైపు ఇస్రో సాధించిన విజయంలో మహిళల పాత్ర కూడా ఉందని ఆయన తెలిపారు. భారత్ జీ20 దేశాలకు నేతృత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు.
Mann Ki Baat 104th Edition : భారతదేశం ప్రపంచానికి మార్గాన్ని చూపుతోంది: మోదీ
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ చంద్రయాన్-3 విజయంతో మనం ఎవరికీ తక్కువ కాదని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడు ప్రపంచానికి దారి చూపిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. మన్ కీ బాత్ 104వ ఎడిషన్ లో ప్రధాని మోదీ ఏం మాట్లాడారో చూద్దాం.
PM Modi : గ్రీస్ పర్యటనకు బయలుదేరిన ప్రధానిమోదీ,అద్భుతమైన ప్రదర్శన ఇవ్వనున్న భారత విద్యార్థులు..!!
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ముగిసిన తర్వాత గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ గ్రీస్‌కు బయలుదేరారు. గ్రీస్‌లోని ఏథెన్స్లో ప్రధాని మోదీ ముందు బాలీవుడ్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇందు కోసం విద్యార్థులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Chandrayaan-3: జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ ని వీక్షించనున్న మోదీ..!
దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్‌గా చంద్రయాన్-3 ల్యాండింగ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించనున్నారు. దక్షిణాఫ్రికాలో మూడు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని.. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటున్నారు. రేపు(ఆగస్టు 23) చంద్రయాన్-3 జాబిల్లిపై ల్యాండ్ అవ్వనుంది. సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండ్ అవ్వనుంది.
MP Arvind: కేంద్రం 5 కోట్ల ఇళ్లను నిర్మిస్తోంది
సీఎం కేసీఆర్‌పై ఎంపీ ధర్మపూరి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇళ్ల నిర్మాణంలో విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలుకాకుండా చేశారని ఎంపీ విమర్శించారు.
Rajasthan Elections: సగం పైగా స్థానాల్లో కొత్త వాళ్లు, బీజేపీ, కాంగ్రెస్ లది అదే స్ట్రాటజీ
రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు మొదలు పెట్టింది. దాదాపు 45మంది నాయకులకు టిక్కెట్ నిరాకరించింది. పార్టీలో కొత్త జోష్ నింపడంతోపాటు కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు బీజేపీ, కాంగ్రెస్ రెండూ పార్టీలు కూడా కొత్త ముఖాలను పోటీకి దింపుతున్నాయి. బీజేపీ 45 మంది పాత ముఖాలను పక్కనపెడితే...కాంగ్రెస్ 50 మంది కొత్త ముఖాలకు ఛాన్స్ ఇచ్చింది. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకే స్ట్రాటజీ కనబరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-34-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ktr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-13-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pk-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-66-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/MODI-1-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/modi-15-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chandrayan-modi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-25-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/BJP-CONGRESS-jpg.webp)