ప్రాణహాని ఉందని డీజీపీని కలిసిన పోసాని!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని ఆయన డీజీపీ రాజేంద్ర నాథ్ ను కలిశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని ఆయన డీజీపీ రాజేంద్ర నాథ్ ను కలిశారు.
చిన్నారి లక్షిత ప్రాణానికి రూ.10 లక్షలు రేటు కట్టారని జగన్‌పై మండి పడ్డారు లోకేశ్. టిటిడి ఛైర్మెన్ భూమన కరుణా కర్ర రెడ్డి భక్తులకు కర్రలు ఇస్తాడట అంటూ సెటైర్లు వేశారు. ఒక ఛాలెంజ్ విసురుతున్నానని.. తాడేపల్లి ప్యాలస్‌లో పులిని వదులుతాం.. జగన్, కరుణా కర్ర రెడ్డి కర్రలతో పులిని తరమాలి? ఛాలెంజ్ కి సిద్ధమా అంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. బహిరంగ సభలో ఆయన ప్రసంగించచారు. ఈ సభకు తెలుగు దేశం కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 28 న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో ఓటర్ల జాబితా సవరణలో చోటు చేసుకుంటున్న తీవ్రమైన పరిణామాల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర గన్నవరంలో కొనసాగుతోంది. నారా లోకేష్ పాదయాత్ర రూట్ ను పోలీసులు మార్చడంతో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో హై టెన్షన్ నెలకొంది. ముందు రూట్ మ్యాప్ ప్రకారం ఎమ్మెల్యే వల్లభనేని ఆఫీసు ముందుగా లోకేష్ పాదయాత్ర వెళ్లాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే వంశీ.. ఆఫీసులోనే ఉండటంతో నారా లోకేష్ పాదయాత్ర అటువైపు వెళ్లకుండా పోలీసులు బార్కేడ్లు అడ్డుపెట్టారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు పసుపు కండువా కప్పుకున్నారు. యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు లోకేష్. నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర గన్నవరం నియోజక వర్గంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో యార్లగడ్డ.. లోకేష్ తో సమావేశమై పార్టీలో చేరారు. ఆ తర్వాత యార్లగడ్డ-లోకేష్ మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది.
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను సుమారు 12 గంటల పాటు ఆగకుండా నిర్వహించారు. యువగళం పాదయాత్ర మొదలు పెట్టిన తరువాత ఆయన నిర్విరామంగా చేపట్టిన యాత్ర ఇదే.
రాబోయే చంద్రన్న ప్రభుత్వంతో ప్రజల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని వెల్లడించారు తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తోన్న నారా లోకేష్ పాదయాత్ర.. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఆదివారం సాయత్రం ప్రారంభమైంది. యువనేత లోకేష్ కు మద్దతు ఇస్తూ యువతీ యవకులు భారీగా రోడ్లపైకి తరలి వస్తున్నారు. అడుగడుగునా లోకేష్ కు విజయవాడ ప్రజలు లోకేష్ కు ఆత్మీయ స్వాగతం పలికారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను లోకేష ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు.
తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 188వ రోజుకు చేరుకుంది. నేటి నుంచి వారం రోజుల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో యువగళం పాదయాత్ర జరగనుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద పాదయాత్రకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉండవల్లి సీతానగరం వద్ద పాదయాత్ర 2,500 కిలో మీటర్లు పూర్తైన సందర్భంగా శిలా ఫలకం ఆవిష్కరించనున్నారు.