China Manja : వెయ్యికి పైగా పక్షుల ప్రాణాలు తీసిన చైనా మాంజా
నిషేధిత చైనా మాంజా తగిలి ముంబై నగరంలో వెయ్యికి పైగా పక్షులు ప్రాణాలు కోల్పొయాయి. 800 వరకు గాయపడ్డాయి. చైనా మాంజాతో మనుషులు కూడా ప్రాణాలు పొగొట్టుకున్న సందర్భాలున్నాయి.
నిషేధిత చైనా మాంజా తగిలి ముంబై నగరంలో వెయ్యికి పైగా పక్షులు ప్రాణాలు కోల్పొయాయి. 800 వరకు గాయపడ్డాయి. చైనా మాంజాతో మనుషులు కూడా ప్రాణాలు పొగొట్టుకున్న సందర్భాలున్నాయి.
దేశంలోనే అతి పొడవైన అటల్ సేతును ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ వంతెన 21 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంది. ఈ బ్రిడ్జిని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని పిలుస్తున్నారు. 21.8కి.మీ మేర ఈ బ్రిడ్జిని నిర్మించారు. రూ. 17,840కోట్లు ఖర్చు చేశారు.
ముంబై 26/11 దాడుల సూత్రధారి...లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణించాడని ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది. ఇతను హఫీజ్ సయీద్‌కు డిప్యూటీగా ఉండేవాడు. హఫీజ్ గుండెపోటుతో మరణించాడని తెలిపింది.
రచయిత జావేద్ అక్తర్ తనపై వేసిన పరువునష్టం దావా కేసు విచారణను నిలిపివేయాలని కోరుతూ ముంబై హైకోర్టును ఆశ్రయించారు నటి కంగన రనౌత్ . అక్తర్ వేసిన కేసుతోపాటు తాను వేసిన క్రాస్ పిటిషన్‌ను కూడా పరిశీలించాలని ఆమె న్యాయస్థానాన్ని రిక్వెస్ట్ చేశారు. జనవరి 9న విచారణ జరగనుంది.
దేశంలోని ఆర్థిక నగరమైన ముంబైలోని కొలాబా వర్లీ , ఇతర ప్రదేశాలలో ఉన్న ప్రధాన మ్యూజియంలకు శుక్రవారం పేలుడు బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ మ్యూజియంలను పరిశీలించారు. అయితే పేలుడు పదార్థాల జాడ మాత్రం లభించలేదు.
నిరుద్యోగులకు ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి ఉత్తీర్ణతతో తమ శాఖలో ఖాళీగా ఉన్న 484 పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తిగ అభ్యర్థులు జనవరి 9 వరకూ అప్లయ్ చేసుకోవాలని సూచించింది.
తెలుగు ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి ముంబయికి వెళ్లిపోయింది. ఎందుకంటే శ్రీలీల ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. అందుకే శ్రీలీల తల్లితో కలిసి ముంబయికి వెళ్లింది.
అగ్గిపుల్ల ఇవ్వలేదనే కోపంలో 22 ఏళ్ల యువకుడు 53 ఏళ్ల వాచ్‌మెన్‌ను కొట్టి చంపిన దారుణం ముంబైలోని బేలాపూర్ రోడ్లో జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 1:45 గంటలకు ప్రసాద్ భానుసింగ్ ఖడ్కా తలపై పెద్ద రాయితో దాడి చేసి చంపిన షేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.