బీభత్సం సృష్టించిన కారు..ముగ్గురు మృతి..పదుల సంఖ్యలో క్షతగాత్రులు!
ముంబైలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా ..12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ముంబైలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా ..12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బాలీవుడ్‌పై కన్నేసారు నటి మంచు లక్ష్మి. అందుకోసం ముంబైకి షిఫ్ట్ అయ్యారు. కొత్త నగరం..కొత్త శకం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎల్లవేళలా నన్ను సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. దక్షిణాదిలోని పరిమితులు ఉత్తరాదిలో ఉండవన్న నటి..ఆడిషన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పోస్ట్ చేసింది. అయితే, ఆమె అభిమానులు కొందరు ఫీల్ అవుతున్నారు.. అయ్యయో..టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న మంచు అక్క బాలీవుడ్ లో ఆడిషన్స్ కు వెళ్లడం ఏంటని కాస్తా నిరాశ చెందుతున్నారు.
ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఘటనాస్థలానికి చేరుకున్న 10 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటన గురువారం అర్థరాత్రి జరిగింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఈ ఘటనలో 40 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ను చాలా కాలం కిందటే ప్రకటించాగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నట్లు ఫిలిమ్ మేకర్స్ తెలిపారు.
పసిడి ప్రియులకు శుభవార్త. కొన్నాళ్లుగా పసిడి ధరలు పడిపోతున్నాయి. నేడు కూడా బంగారం ధరల్లో భారీ తగ్గదల కనిపించింది. బులియన్ మార్కెట్లో శనివారం ఉదయం వరకు నమోదు అయిన బంగారం ధరల ప్రకారం చూసినట్లయితే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53, 650గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 58,530గా ఉంది. అంటే 10 గ్రాముల బంగారం ధరపై రూ. 250 నుంచి 270 రూపాయలు తగ్గింది.
అమ్మ లేని ఇల్లు బోసిపోతుంది. ఎందుకంటే జ్యోతిక వదినని నేను ఎప్పుడూ కూడా వదినగా చూడలేదు. అమ్మగానే చూశాను. ఆమె కూడా నన్ను ఎప్పుడూ కూడా మరిదిలాగా చూడలేదు. తన పిల్లలతో సమానంగా నన్ను కూడా ఒక కొడుకులాగే చూసేదని ఆయన తెలిపారు.
విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్ గా కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. అత్యధికులు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జేడీయూ నేతలు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇండియా కూటమికి నాయకత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్ కు ఇస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు.
విపక్ష ‘ఇండియా’ కూటమి నిర్వహించే మూడవ సమావేశానికి ఆప్ నేతలు హాజరవుతారా? లేదా అనే అనుమానాలకు తెరపడింది. ముంబైలో నిర్వహించబోయే సమావేశానికి తాము హాజరవుతామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. తాము ముంబైకి వెళ్తామని, తమ వ్యూహమేంటో తెలియజేస్తామని మీడియాతో ఆయన అన్నారు.