Lok Sabha:పేపర్ లీక్ నిరోధక బిల్లుకు లోక్‌సభలో ఆమోదం
ప్రభుత్వ పరీక్షల్లో.. ఎగ్జామ్స్ పేపర్ లీక్, కాపీయింగ్ లాంటివి అరికట్టేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన యాంటీ చీటింగ్ బిల్లును ఈ రోజు లోక్‌సభ ఆమోదించింది. దీంతో ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కోసం వెళ్ళింది.
ప్రభుత్వ పరీక్షల్లో.. ఎగ్జామ్స్ పేపర్ లీక్, కాపీయింగ్ లాంటివి అరికట్టేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన యాంటీ చీటింగ్ బిల్లును ఈ రోజు లోక్‌సభ ఆమోదించింది. దీంతో ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కోసం వెళ్ళింది.
వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టమన్నారు మోదీ. లోక్‌సభ వేదికగా ప్రతిపక్షాలపై నిప్పులుచెరిగారు. నేతల పిల్లలు రాజకీయాల్లోకి రావడం తప్పు కాదని.. అయితే వాళ్లే మొత్తంగా పార్టీని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదన్నారు. తాను, రాజ్‌నాథ్ వారసత్వ రాజకీయాలు చేయలేదన్నారు.
ఎంపీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చాలని భావిస్తున్న కేసీఆర్.. మహబూబాబాద్ ఎంపీ టికెట్ ను ఐఆర్ఎస్ అధికారి జీవన్ లాల్ కు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గ ప్రజలకు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ జీవన్ లాల్ పేరుతో వెలసిన ఫ్లెక్సీలు ఈ చర్చకు కారణమయ్యాయి.
లోక్ సభలో ఎంపీల సస్పెన్షన్ పరంపర కొనసాగుతుంది. తాజాగా మరో ముగ్గురు ఎంపీలను సభ గురువారం సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది.
పాత చట్టాలు పోయి కొత్త చట్టాలు వస్తున్నాయి. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడింటి స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన మూడు న్యాయసంహిత బిల్లులకు ఈరోజు లోక్ సభ ఆమోదం తెలిపింది.
పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ పరంపర కొనసాగుతుంది. సోమవారం నాడు 79 మంది ఎంపీలను సస్పెండ్ చేయగా..మంగళవారం నాడు 50 మంది ఎంపీలను సభ సస్పెండ్ చేసింది.
లోక్‌సభలోకి ఆగంతకులు స్మోక్ స్టిక్స్ తీసుకెళ్లడంతో పార్లమెంట్ భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పొగ పదార్థాలను పార్లమెంట్ లోపలికి ఎలా తీసుకెళ్లగలిగారు? ఆగంతకులకు లోపల వ్యక్తుల నుంచి మద్దతు ఉందా? లాంటి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు సామాన్యులు.
ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్లోకి దూకడం, టీయర్ గ్యాస్ విసరడం ప్రకంపనలు రేపింది. లోక్‌సభలో ఆగంతకులు పొగ బాంబులు విసురుతుంటే ఎంపీలందరూ పరుగులు పెట్టగా.. రాహుల్ గాంధీ మాత్రం ఎలాంటి భయంలేకుండా అలానే నిలబడ్డారు.
పాపం ఆదిలోనే హంసపాదు పడింది కర్ణాటక కాంగ్రెస్ కు. లోక్ సభ ఎన్నికలకు బాగా ప్రిపేర్ అవుదామనుకుంది..సినీ నటుడు శివ రాజ్ కుమార్ ను ఆయుధంగా వాడాలనుకుంది. కానీ ఆ ప్లాన్ పట్టాలకెక్కకుండానే ఎర్ర జెండా ఊపేశాడు శివన్న.