పార్లమెంట్ లో తళుక్కుమన్న హీరోయిన్ తమన్నా
సినీ నటి తమన్నా భాటియా పార్లమెంట్ లో మళుక్కుమన్నారు. గత రెండు రోజులుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని సెలబ్రిటీలు సందర్శిస్తున్నారు. రెడ్ కలర్ వారీలో వచ్చిన తమన్నా అక్కడ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
సినీ నటి తమన్నా భాటియా పార్లమెంట్ లో మళుక్కుమన్నారు. గత రెండు రోజులుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని సెలబ్రిటీలు సందర్శిస్తున్నారు. రెడ్ కలర్ వారీలో వచ్చిన తమన్నా అక్కడ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
2026లో జరిగే లోక్ సభ నియోజవర్గాల పునర్విభజనలో తెలంగాణ, ఏపీలో భారీగా సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇరు రాష్ట్రాల ఎంపీ సీట్ల సంఖ్య ప్రస్తుతం 42 ఉండగా.. 5 నుంచి 8 సీట్లు తగ్గనున్నాయి.
పార్లమెంటు సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మొదటిరోజు పాత భవనంలో చర్చ మొదలవ్వగా రెండవరోజు 19 నుంచి కొత్త పార్లమెంటు భవనంలో సమావేవాలు జరుగుతాయి. ఈ సెషన్స్ లో రాజ్యసభలో మూడు , లోక్ సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం అజెండాను విడుదల చేసింది.
నిశికాంత్ స్పీచ్‌పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్‌పై నిన్న దూబే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు చైనా నుంచి డబ్బు వచ్చిందన్న దూబే వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఆ మాటల్ని ప్రసంగం నుంచి స్పీకర్ తొలగించారు. కానీ తొలగించిన దూబే స్పీచ్‌ను లోక్‌సభ వెబ్సైట్లో అప్లోడ్ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మూడు నెలలుగా జాతి ఘర్షణలు కొనసాగుతున్నా కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని విపక్ష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.అధికారం కోసం బీజేపీ మణిపూర్‌ను తగులబెట్టేందుకు సిద్దమవుతోందని విమర్శించారు.అలాగే మణిపూర్‌లో హింసపై బీజేపీకి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదంటూ మండిపడ్డారు.ఇదే అంశంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికీ నోటీసు ఇచ్చామని తెలిపారు.
బుధవారం లోక్ సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. ''అన్ని పార్టీ నాయకులతో చర్చించి..దీనిని చర్చకు తీసుకోవడానికి తగిన సమయాన్ని మీకు తెలియజేస్తానని ఓం బిర్లా లోక్ సభలో ప్రకటన చేశారు.
దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలపై మోడీ ప్రభుత్వం నోరు మెదపడం లేదని లోక్ సభలో విపక్షాలు మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం మోడీ సర్కార్ పై బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా అవిశ్వాస తీర్మానానికి నోటిసులు ఇచ్చాయి. ప్రస్తుతం దేశాన్ని అట్టడుకిస్తున్న అంశం..మణిపూర్ హింస ఘటన.