Nampally Court: ఐబొమ్మ రవికి మరో బిగ్ షాక్..
సినిమాలను పైరసీ చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడిపై కస్టడీకి పర్మిషన్ ఇస్తూ నాంప్లల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సినిమాలను పైరసీ చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడిపై కస్టడీకి పర్మిషన్ ఇస్తూ నాంప్లల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ని ముట్టడించడానికి తెలంగాణ జాగృతి నేతలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కవితతోపాటు పలువురు జాగృతినేతల్ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ ప్రారంభించారు. అంతకుముందు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్‌లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. పలువురు మహిళలకు ఆయన చీరలు పంపిణీ చేశారు.
పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఇద్దరు ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ దొరికిపోయారు. సర్వేయర్ రూ.1లక్ష లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. హైదరాబాద్–సికింద్రాబాద్ MRO ఆఫీస్‌లో సర్వేయర్, అతని సహచరుడు అవినీతికి పాల్పడ్డారు.
కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంగళవారం మంత్రి సీతక్కతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో వాట్సప్ మీ సేవ సర్వీసులను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇందులో 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కిపైగా సర్వీసులను వాట్సప్ ద్వారా పొందేలా మీసేవ ఏర్పాట్లు చేసింది. మెటా, మీ సేవ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
ఐ బొమ్మ తో సినిమా నిర్మాతలకు బొమ్మ చూపించడమే కాకుండా కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. రవి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన రవి పైరసీ కింగ్ పిన్‌గా మారాడు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నాగారంలో సూర్యాపేట-జనగామ హైవేపై పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ కమలాకర్‌ను అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. కానిస్టేబుల్ మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించింది. దీంతో 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్‌తో ఆస్పత్రిలో చేరిన చిన్నారులకు ఇచ్చిన యాంటీ బయాటిక్ ఇంజక్షనే దీనికి కారణమని ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి.