ఆంధ్రప్రదేశ్ AP: పోలీసుల నిర్లక్ష్యంపై హోంశాఖ సీరియస్.. ఇద్దరు అధికారులు సస్పెండ్..! నంద్యాల రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ సస్పెండ్ అయ్యారు. నంద్యాల జిల్లా సీతారామపురం వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడి హత్య కేసుపై పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించడంతో హోంశాఖ సీరియస్ అయింది. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నంద్యాలలో దారుణం.. రౌడీ షీటర్ ను కత్తులతో నరికి.. నంద్యాల జిల్లా అయ్యలూరు మెట్ట సమీపంలో రౌడీ షీటర్ సాయి అలియాస్ కవ్వ దారుణ హత్యకు గురైయ్యారు. దుండగులు అతడి తలపై కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసు తోపాటు పలు హత్య కేసుల్లో మృతుడు సాయి నిందితుడుగా ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kurnool : కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ దాడి.. కాపు కాచి మరీ.. కర్నూలు జిల్లా మల్కాపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భూతగాదాల నేపథ్యంలో కాపు కాచి మరీ వేటకొడవళ్లు, రాళ్లుతో టీడీపీ నేతలు వైసీపీ నేతలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం వెళ్లిన తెలంగాణ వ్యక్తి.. ఇంతలోనే.. శ్రీశైలం డ్యాం వద్ద స్నానానికి వెళ్లిన తెలంగాణ వ్యక్తి గల్లంతైయ్యాడు. నల్లగొండ జిల్లా వెంకటాపురానికి చెందిన చొప్పరి యాదయ్య తోటి స్నేహితులతో కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం వెళ్లారు. డ్యాం వద్ద స్నానానికి వెళ్లిన యాదయ్య నీటిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలంలో తృటిలో తప్పిన ప్రమాదం.. హఠాత్తుగా డ్యామ్ గేట్లు తెరవడంతో.. శ్రీశైలం జలాశయం సమీపంలో తృటిలో ప్రమాదం తప్పింది. లింగలగట్టు గంగ బ్రిడ్జి కింద కారును ఆపి స్నానాలకు వెళ్లారు వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రయాణికులు. హఠాత్తుగా డ్యామ్ గేట్లు తెరవడంతో కారు నీటిలో మునిగిపోయింది. గమనించిన ప్రయాణికులు స్థానికుల సహాయంతో కారును నీటిలో నుంచి బయటకు తీశారు. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kurnool: గుర్రపు స్వారీ చేస్తూ కిందపడి...యువకుడి మృతి!. కర్నూలు మద్దికేరలో గుర్రపు స్వారీ చేస్తూ కిందపడిన పృథ్వీరాజ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. తన పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు పృథ్వీరాజ్ సిద్ధమయ్యాడు.కొత్త వ్యక్తి కావడంతో గుర్రం పరుగులు పెట్టింది. By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: బీ అలర్ట్.. ఇవాళే శ్రీశైలం గేట్లు ఓపెన్..! శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఇవాళ సాయంత్రం 4. గంటలకు అధికారులు జలాశయం గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. దిగువ ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : కర్నూలులో విధ్వంసం.. చెల్లాచెదురుగా ప్రాజెక్టు స్టేజ్ 1 పంపు హౌస్..! కర్నూలులో గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్టేజ్ 1 పంపు హౌస్ ధ్వంసం చేశారు. స్టాటర్లు, బ్రేకర్లు, ఇన్ఫఫీలేటర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో 4200 ఎకరాలకు సాగునీటి సరఫరా నిలిచిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మా ఆకలి తీర్చండి సార్.. కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు..! కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మా ఆకలి తీర్చండి సార్ అంటూ కేజీబీవీ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు సరైన ఆహరం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn