Minister Ktr: నాటుకోడి కూర, బగరా రైస్ వండిన మంత్రి కేటీఆర్!
మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ టీంతో మంత్రి కేటీఆర్ సందడి చేశారు. టీంతో కలిసి కేటీఆర్ నాటుకోడి కూర, బగారా రైస్ వండి సరదాగా గడిపారు
మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ టీంతో మంత్రి కేటీఆర్ సందడి చేశారు. టీంతో కలిసి కేటీఆర్ నాటుకోడి కూర, బగారా రైస్ వండి సరదాగా గడిపారు
తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి జరుగుతోందని కేటీఆర్ అన్నారు. ఒక్క కేసీఆర్‌ను ఓడించేందుకు అందరూ ఏకమవుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మీదకు కాంగ్రెస్, బీజేపీ దండులా వస్తున్నాయని.. కేసీఆర్ సింహంలాంటోడు, సింగల్‌గానే వస్తాడని కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దాడి చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని.. ఓ నేరస్థుడిని టీపీసీసీ అధ్యక్షుడిగా చేశారంటూ కేటీఆర్ వేసిన ట్వీట్‌పై రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని చిల్లర రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే మీ కచరా ప్రయత్నం చూస్తుంటే బీఆర్ఎస్ ఓటమి ఖాయం ఐనట్టేనంటూ మండిపడ్డారు.
మనకొండూరు టికెట్ దక్కకపోవడంతో బీజేపీపై ఆగ్రహంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు దరువు ఎల్లన్న ఈ రోజు బీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.
రానున్న ఎన్నికల్లో మరో సారి తాము అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరెంట్ రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్ణాటకలోని ఓ గ్రామ రైతులు సబ్ స్టేషన్లో మొసలిని వదిలారు. ఈ వీడియోను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 'ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో' అంటూ కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు కేటీఆర్.
రుణమాఫీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోపు మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేశామన్న కేటీఆర్..రైతుబంధు కింద రూ. 73వేల కోట్లు ఖాతాల్లో వేశామన్నారు. 13లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మీ అందించామన్నారు. మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వస్తే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రవళిక పేరెంట్స్ ఈ రోజు ప్రగతిభవన్ లో మంత్రిని కలిశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసానిచ్చారు.
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ప్రవళిక ఆత్మహత్య ఘటన వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె గ్రూప్-1, 2, 3, 4 తో పాటు DAOకు దరఖాస్తు చేసుకుందని.. అందుకు సంబంధించిన పత్రాలను సోషల్ మీడియాలో వివిధ పార్టీల నాయకులు, నిరుద్యోగులు షేర్ చేస్తున్నారు.