Dharani Portal Vs Bhu Bharathi | Land Registration Law Explained | CM Revanth Reddy | RTV
కేటీఆర్ అరెస్ట్ తర్వాత పార్టీ పగ్గాలు ఎవరందుకోబోతున్నారనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కవిత, హరీష్రావు లీడ్లో కనిపిస్తుండగా కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కవితకే బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.
మాజీ సీఎం కేసీఆర్పై కేసు నమోదు చేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జరిగిన తప్పిదాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక విడుదల చేసింది. కోట్ల నష్టం వచ్చినట్లు నివేదిక తెలపడంతో కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం.
మాజీ సీఎం కేసీఆర్ అమెరికా టూర్ వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మనువడి హిమాన్ష్తో సమయం గడపడానికి కేసీఆర్ అమెరికా వెళ్లి.. 2025 ఫిబ్రవరిలో తిరిగి రానున్నట్లు బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చలు నడుస్తున్నాయి.
TG: కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ పాలనలో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాన్నే పదవులు వరించాయని విమర్శించారు. కాంగ్రెస్ను విమర్శించే అర్హత BRSకు లేదన్నారు.
గుజరాత్ మోడల్ గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ కు లేదని నిజమాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. హైడ్రాతో హైదరాబాద్ రియల్ఎస్టేట్ను నాశనం చేశారని మండిపడ్డారు. హామీలను విస్మరిస్తే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని విమర్శించారు.