KTR : తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీల ఆవిర్భావం ,పార్టీ సంస్థాగత మార్పులపై ఆయన తనదైన శైలిలో స్పందించారు.ఇటీవల రాజకీయ తెరపైకి వచ్చిన 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS) వంటి కొత్త పార్టీల గురించి ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎన్నో పార్టీలు వస్తుంటాయని, పోతుంటాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇటువంటి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, తమ దృష్టి కేవలం ప్రజల పక్షాన పోరాడటంపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.
పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. స్టేట్ కమిటీ మినహా, బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే పార్టీకి విధేయులుగా ఉండే నిఖార్సైన కార్యకర్తలతో కొత్త కమిటీలను వేస్తామని వెల్లడించారు. రాజకీయాల్లో కేవలం ఆవేశం ఉంటే సరిపోదని, ఆలోచనతో కూడిన పక్కా ప్రణాళిక అవసరమని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని బీఆర్ఎస్ ప్రధాన ఆయుధంగా మలుచుకోనుంది.
ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టడంతో పాటు, ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇకపై పార్టీ నేతలు జిల్లాల వారీగా పర్యటించి, స్థానిక సమస్యలను గుర్తించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా నిరసనలు చేపడతారు.అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నిలబడటమే బీఆర్ఎస్ నైజమని, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
ఈ కార్యవర్గ సమావేశం ద్వారా బీఆర్ఎస్ తన శ్రేణులను యుద్ధానికి సిద్ధం చేస్తోంది. పార్టీలో కొత్త రక్తాన్ని నింపడంతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా గులాబీ దళం కదులుతోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రక్షాళన పార్టీకి ఏ మేరకు మేలు చేస్తుందో వేచి చూడాలి.
KTR : పార్టీలు వస్తుంటాయి..పోతుంటాయి...పట్టించుకోవద్దు....కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో కొత్త పార్టీల ఆవిర్భావం ,పార్టీ సంస్థాగత మార్పులపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నో పార్టీలు వస్తుంటాయని, పోతుంటాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇటువంటి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
ktrs response to kavithas new party