Tungabhadra: కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్
కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు వరదలకు కొట్టుకుపోయింది. శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటి వరకు లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోయింది.
కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు వరదలకు కొట్టుకుపోయింది. శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటి వరకు లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోయింది.
కర్ణాటకలో ఓ వరుడు దారుణానికి పాల్పడ్డాడు. బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్న నవీన్ తాళి కట్టిన కొన్ని గంటల్లోనే భార్య లిఖితశ్రీ ని కొడవలితో నరికి చంపాడు. తర్వాత తాను అదే కొడవలితో గాయపరుచుకోగా చికిత్స పొందుతూ మరణించాడు.
కేరళ కొండచరియలు విరిగి పడి ఇళ్లు కోల్పోయిన వాయనాడ్ బాధితులకు కర్ణాటక ప్రభుత్వం 100 ఇళ్లు కట్టిస్తామని ప్రకటించింది. మరోవైపు పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందించారు.
మిస్ గ్లోబల్ ఇండియా-2024 కిరీటాన్ని బెంగళూరుకి చెందిన స్వీజల్ ఫుర్టాడో కైవసం చేసుకుంది. జులై 28న జైపూర్‌లోని క్లార్క్స్ అమెర్‌లో జరిగిన మిస్ సూపర్ మోడల్ ఇండియా ఈవెంట్లో ఆమెకు ఈ కిరీట పట్టాభిషేకం జరిగింది.
కర్ణాటకలో మటన్ పేరుతో అమ్ముతున్నది కుక్క మాంసం కాదని తేలింది. అది సిరోహి అనే మేక జాతికి చెందిన మాంసం అని పోలీసులు నిర్ధారించారు. దీంతో సిరోహి జాతి మేక గురించి నెట్టింట తెగ చర్చ మొదలైంది. దాని ప్రత్యేకతలకోసం పూర్తి ఆర్టికల్ చదవండి.
కర్నాటకకు చెందిన ఓ మహిళ ఆరేళ్లలో ఏకంగా ఆరుగురు భర్తలను మార్చింది. ఇటీవల ఏడో పెళ్లి కూడా చేసుకుంది. అంతటితో ఆగకుండా ఏడో భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. డబ్బుల కోసమే ఆమె ఇలా చేస్తోందని ఏడో భర్త కోర్టుకు తెలిపాడు. దీంతో కోర్టు ఆ మహిళను మందలించింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో కుక్క మాంసం రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వ్యాపారి మటన్ ముసుగులో కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నాడని కొన్ని హిందూత్వ సంఘాలు ఆరోపించాయి. దీంతో ఫుడ్ సెఫ్టీ అధికారులు మాంసం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు.
కర్ణాటకలో ఓ పోలీస్ డాగ్ ఓ హంతకుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించింది.చన్నగిరి లోని ఓ వ్యక్తి హత్యకు గురైనట్టు పోలీసులకు సమాచారం అందగా డాగ్ స్క్వాడ్ తో అక్కడికి చేరుకున్నారు. మృతదేహం వద్ద దొరికిన క్లూస్ తో పోలీస్ డాగ్ 8 కిలో మీటర్లు పరిగెత్తి హంతకుడిని పట్టుకుంది.
కావేరి నదికి అడ్డంగా మేఘదాతు డ్యామ్ నిర్మించేందుకు కర్ణాటక ప్రభుత్వానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసింది.అంతకుముందు తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ జలశక్తి శాఖకు లేఖలు పంపింది.కర్ణాటకలోని నీటి కొరతకు దేవేంద్రగౌడ్ డ్యాం నిర్మించుకోవాలని కేంద్రం తెలిపింది.