JEE మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలను ఎన్టీయే నిన్న మధ్యాహ్నం విడుదల చేసింది. అయితే ఇప్పుడు అందులో 110 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేసింది. వారు ఫోర్జరీ దస్త్రాలు ఉపయోగించారని గుర్తించామని ఎన్టీఏ అధికారులు తెలిపారు.
పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తాను చాటా. దేశ వ్యాప్తంగా సుమారు 56 మందికి 100 పర్సంటైల్ రాగా అందులో ఏపీ, తెలంగాణకు చెందిన వారు 22 మంది ఉన్నారు. ఈ ఫలితాలను ఎన్టీఏ బుధవారం అర్థరాత్రి విడుదల చేసింది.
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ మొదటి పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల అయింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదిని ఐఐటీ మద్రాస్ ప్రకటించింది. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పరీక్షను 2024 మే 26న రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 21 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించింది.