Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 128 మంది మృతి
హంకాంగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటిదాకా 128 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 200 మందికి పైగా ఇంకా ఆచూకీ దొరకలేదని పేర్కొన్నారు.
హంకాంగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటిదాకా 128 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 200 మందికి పైగా ఇంకా ఆచూకీ దొరకలేదని పేర్కొన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికొన్నిరోజుల్లో భారత్‌కు రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది.
శ్రీలంకలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి దిత్వా తుఫాను కూడా తోడైంది. దీంతో అక్కడ ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఇందులో 56 మంది మృతి చెందారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఏమయ్యారు? ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ప్రశ్న ఇది. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లు, కొడుకు ఎవరు అడిగినా ఆయనను చూపించడం లేదు. కనీసం దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. పాకిస్తాన్ ఏం దాస్తోంది?
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలోని కాల్పులు జరగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది ఉగ్రదాడేనని ట్రంప్ ధ్వజమెత్తారు. కాల్పులు చేసిన నిందితుడు అఫ్గానిస్థాన్‌కు చెందిన రెహ్మనుల్లా లఖన్వాల్గా అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం 14 ఏళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై దేశ వ్యాప్తంగా 121 కేసులు నమోదయ్యాయి. లాహోర్ నగరంలో 12 ఉగ్రవాద కేసులు, ఫైసలాబాద్ 14 కేసులు, దేశవ్యాప్తంగా 22 ఉగ్రవాద కేసులు నమోదు చేశారు.
ఆఫ్రికాలోని గినియా-బిస్సావులో ఎన్నికలు జరిగి మూడు రోజులైంది. కానీ ఇంతలోనే ఆ దేశ సైన్యం ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంది. అధ్యక్షుడు ఎంబాలో మిస్సింగ్ అయ్యారు. ప్రస్తుతం ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీ నివాస్ మిట్టల్ బ్రిటన్ దేశం వదిలివెళ్లారు. సూపర్ రిచ్‌లపై భారీగా పన్నులు విధించడానికి లేబర్ పార్టీ నాయకత్వంలోని బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. దీంతో ఆయన యూకేను వీడి దుబాయ్‌కు మకాం మార్చినట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు మొదలైన తర్వాత అధికారంలోకి వచ్చిన యూనస్ ప్రభుత్వం పాకిస్థాన్‌తో సంబంధాలు మెరుగుపర్చుకుంటోంది. ఇప్పటికే పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ బంగ్లాదేశ్‌కు లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది.