Isarel:మళ్లీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 59 మంది పాలస్తీనీయులు మృతి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా డెయిర్ అల్ బలాలో ఆహారం కోసం సహాయక కేంద్రం వద్ద ఉన్నవాళ్లపై కాల్పులకు దిగింది. ఈ దాడుల్లో 59 మంది పాలస్తీనీయులు మృతి చెందారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా డెయిర్ అల్ బలాలో ఆహారం కోసం సహాయక కేంద్రం వద్ద ఉన్నవాళ్లపై కాల్పులకు దిగింది. ఈ దాడుల్లో 59 మంది పాలస్తీనీయులు మృతి చెందారు.
ఇండోనేషియాలో ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. 26 అడుగుల భారీ కొండచిలువ ఏకంగా ఓ మనిషినే మింగేసింది. ఆగ్నేయ సువేసిలోని దక్షిణ బుటన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
మోదీకి డోనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్‌పై 500 శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. త్వరలోనే యూఎస్ సెనేట్‌లో దీనిపై బిల్లు తెస్తామని లిండ్సే తెలిపారు.
గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే షరతులు ఎలాంటివనేది మాత్రం వివరించలేదు.
టాంజానియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్యాసింజర్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 40 మంది స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం కిలిమంజారో ప్రాంతంలోని మోషి-టాంగా రహదారిపై చోటుచేసుకుంది.
పోర్చుగల్‌లోని ఒక బీచ్‌లో ఎత్తైన సముద్ర కెరటాన్ని పోలి ఉన్న మేఘాల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీచ్‌లో చాలా మంది స్నానాలు చేస్తున్న సమయంలో మేఘాలు ఒక్కసారిగా సముద్ర కెరటాన్ని తలపించాయి. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
థాయ్‌లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానిపై వేటు పడింది. థాయ్‌లాండ్ రాజ్యాంగ కోర్డు మంగళవారం ప్రధానమంత్రి పెటంగటార్న్ షినవత్రాపై సస్పెన్షన్ విధించింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.
ఇండోనేషియాలోని జకార్తా విమానాశ్రయంలో భారీ ప్రమాదం నుంచి ఓ విమానం తప్పించుకుంది. బోయింగ్ 737 విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కొన్ని సెకన్ల పాటు కుడి వైపుకు వంగిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.