Asim Munir: దమ్ముంటే మమ్నల్ని ఎదుర్కో.. ఆసిం మునీర్‌కు టీటీపీ హెచ్చరిక
తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదాలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌ను గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి.
తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదాలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌ను గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి.
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో మరికొన్ని రోజుల్లో ఆసియన్ (ASEAN) సదస్సు జరగనుంది. అక్టోబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది.
హాంకాంగ్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఈ ఎమిరేట్స్ స్కైకార్గో విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై నుంచి జారి సముద్రంలో పడిపోయింది. అదే సమయంలో విమానం గ్రౌండ్ వెహికల్‌ను ఢీకొట్టింది. దీంతో గ్రౌండ్ వెహికల్లో ఉన్న ఇద్దరు సిబ్బంది మృతి చెందినట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. ఆయన అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా లక్షల మంది ప్రజలు రోడ్లపైకి నిరసనలు తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కరేబియన్ సముద్రంలో జలాంతర్గామిపై దాడి చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమర్ధించుకున్నారు. అలా చేయకపోయి ఉంటే మాదక ద్రవ్యాలు యూఎస్‌కు చేరి 25వేల మంది అమెరికన్లు చనిపోయి ఉండేవారని అన్నారు.
గాజాపై హమాస్ దాడి చేయొచ్చని అమెరికా హెచ్చరించింది. కాల్పుల విరమణను ఉల్లంఘించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం అందిందని చెప్పింది. పాలస్తీనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయవచ్చని చెప్పింది.
ఒకవైపు సరిహద్దు ఉద్రిక్తతలతో సతమతమవుతున్న భారత్, పాక్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు అర్థరాత్రి భూకంపంతో వణికిపోయాయి. ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది. అలాగే కశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్‌లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.
దాదాపు పది రోజుల పాటూ జరిగిన మారణ హోమానికి తెర పడింది. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీని తరువాత కూడా రెండు దేశాలు మరో సారి సమావేశం అవనున్నాయి.
విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. చైనాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడి లగేజీలో బ్యాటరీ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో విమానాల్లో ఉన్న ప్రయాణికులందరూ భయందోళన చెందారు. చవిరికి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది.