గో బ్యాక్ హైడ్రా.. పాతబస్తీలో హైటెన్షన్
TG: పాతబస్తీలో హైడ్రాకు నిరసన సెగ తగిలింది. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. గో బ్యాక్ హైడ్రా అంటూ నినాదాలు చేపట్టారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగగా.. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
TG: పాతబస్తీలో హైడ్రాకు నిరసన సెగ తగిలింది. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. గో బ్యాక్ హైడ్రా అంటూ నినాదాలు చేపట్టారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగగా.. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
మూసి పరివాహక ప్రాంతంలో అధికారులు చేపట్టిన సర్వే ఉద్రికత్తకు దారితీసింది. సర్వేను అడ్డుకున్న స్థానికులు అధికారుల చేతుల్లో నుంచి పత్రాలను లాక్కున్నారు. గోడలపై మార్క్ కూడా చేయనివ్వలేదు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెళ్లిపోయారు.
మూసీ నది ఆక్రమణలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నది సుందరీకరణలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి దాదాపు 1600 నిర్మాణాలను తొలగించనుంది. అలాగే నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించి పునరావాసం కల్పించనుంది.
ఏపీలో హైడ్రా తరహా చర్యలు కొనసాగుతున్నాయి. మచిలీపట్నంలోనూ మున్సిపల్ అధికారులు పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు. మూడు స్థంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంబడి మడుగు ప్రభుత్వ భూమిలో నిర్మించిన 180 నివాసాలను కూల్చివేశారు.
హైడ్రా బాధితులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
హైడ్రా భయంతో మంచిరేవుల గ్రామస్థులు దారుణానికి పాల్పడ్డారు. ఇటీవల వర్షాలకు నిండిన వీరభద్రస్వామి గుట్ట దగ్గరలోని మల్లన్న కుంట అలుగును తెంపేశారు. తమ ఇళ్లలోకి నీరు వస్తే హైడ్రా చర్యలు తీసుకుంటుందనే భయంతో ఈ చర్యకు పాల్పడ్డారు. అధికారులు వారిపై చర్యలకు సిద్ధమయ్యారు.
TG: హైడ్రా తరహాలో మున్సిపల్ అధికారులు పనిచేస్తున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో అక్రమకట్టడలపై ఉక్కుపాదం మోపుతున్నారు. సర్వే నెంబర్ 993లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన ఏడు నిర్మాణాలను నేలమట్టం చేశారు.
కూకట్‌పల్లిలోని పాత గ్రామంలో నల్ల చెరువుకు చెందిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. భూయజమానులు సామాన్యులకు లీజుకు ఇచ్చారు. వీళ్లకి సమాచారం ఇవ్వకుండా ఇరిగేషన్ అధికారులు నిర్మాణాలు కూల్చగా..యంత్రాలు ధ్వంసమయ్యాయి.
సోమవారం మాదాపూర్‌లో కావూరి హిల్స్‌లోని పార్కు ప్రాంతంలో నిర్మించిన ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. పార్కులో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో అధికారులు అకాడమీ నిర్మాణాలు తొలగించారు.