Hyderabad Murder : అవమానించారని హత్య చేశాడు.. బురఖా వేసుకొచ్చి మరి లేపేశాడు!
కలకలం రేపిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అవమానించారన్న కారణంలో వృద్ధ దంపతుల ప్రాణాలను నిలువునా తీసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఇప్పటికే ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. మరో నిందితుడి కోసం పోలీస్ బృంధాలు గాలిస్తున్నాయి.
BIG Breaking : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. పెంచిన బస్ పాస్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ జాగృతి కార్యకర్తలతో బస్ భవన్ ముట్టడించేందుకు ఆమె ప్రయత్నించారు. దీంతో కవితను అదుపులోకి తీసుకుని చంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
BIG BREAKING: జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్
జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు హైదరాబాద్‌లో అరెస్ట్ అయ్యారు. జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంట్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్‌లో కేసు నమోదైంది.
Heavy Rains: తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్
రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40KM వేగంతో ఈదురుగాలులు వీవే అవకాశం ఉంది.
Phone Tapping Case: బిగ్ ట్విస్ట్.. హైదరాబాద్‌కు చేరుకున్న ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న SIB మాజీ డీజీపీ ప్రభాకర్ రావు ఇండియాకు చేరుకున్నారు. LOC, రెడ్ కార్నర్ నోటీసులు మంజూరు చేసు ఆయన అమెరికా పాస్‌పోర్టును రద్దు చేయించారు పోలీసులు. దీంతో ప్రభాకర్ రావు ఆదివారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.
MLA Maganti Gopinath: అనుచరుడు సర్దార్ ఆత్మహత్యతో మనస్థాపం.. నిద్రాహారాలు మానేసిన మాగంటి
మాగంటి గోపీనాథ్ అనుచరుడు సర్థార్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన మనస్థాపం చెంది ఆరోగ్యం క్షీణించింది. 3రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. బాబా ఫసయుద్ధీన్ వేధింపుల కారణంగా సర్థార్ ఇంటిపై నుంచి దూకి చనిపోయాడు.
Fire Accident: షాకింగ్.. శవాన్ని దహనం చేస్తుండగా ఎగసిపడిన నిప్పురవ్వలు - ఊరు ఊరంతా భయంతో పరుగులు!
జగిత్యాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అర్బన్ మండలం ధరూర్‌లోని స్క్రాప్ దుకాణంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఫైర్‌సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. శ్మశానంలో శవాన్ని దహనం చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిరిపడ్డాయి. ఈ క్రమంలో మంటలు చెలరేగాయి.
HYD Crime: తాగిన మైకంలో ఇలా చేశావేంట్రా.. తన భార్య అనుకుని పక్కింటి మహిళ పై..!
హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పరిధి కాటేదాన్‌లో దారుణం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన సలీమ్ తాగిన మైకంలో తన భార్యను చంపాలనుకొని పక్కంటి మహిళపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.
/rtv/media/media_files/2025/06/11/ED7J6CcKlQw2DazqNQq6.jpg)
/rtv/media/media_files/2025/06/10/GDaFlmzcBnnFrOX01enh.jpg)
/rtv/media/media_files/2025/06/10/JmSvfp90BFVYtJzCCbHb.jpg)
/rtv/media/media_files/2025/06/09/olumgdMNCx8OTHDu57Nb.jpeg)
/rtv/media/media_files/2025/04/27/RBOdzRYd4lqrk2eYAn5f.jpg)
/rtv/media/media_files/2025/06/09/lfE92CwyGLQVoKVQGqNJ.jpg)
/rtv/media/media_files/2025/06/08/vHwJEnPNrrNaCpy7VTNF.jpg)
/rtv/media/media_files/2025/06/07/8oLSDb68l6q9eeLPvwmM.jpg)
/rtv/media/media_files/2025/06/07/OiILTLyLjXHnhBVNlXnT.jpg)