BIG BREAKING: హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన FIRను క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన FIRను క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
పీజీ వైద్య కళాశాలల్లో ప్రవేశానికి సంబందించి హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. . 15% ఆలిండియా కోటాలో.. తెలంగాణలో MBBS, BAMS, BHMS పూర్తిచేసిన రాష్ట్రేతర విద్యార్థులు కూడా పీజీ కోర్సుల్లో ప్రవేశానికి స్థానిక కోటా కింద అర్హులని తెలిపింది.
నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణకు న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. డిసెంబర్ 24కు విచారణను వాయిదా వేసింది. ప్రతి రెండు గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటిని పరిశీలించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
నటుడు మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు తనకు పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని పిటిషన్ లో కోరారు. మోహన్ బాబు తరఫున నగేష్ రెడ్డి, మురళి పిటిషన్ వేశారు.
పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించికి బాధితులు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే పోస్టుల భర్తీ విషయంలో చూపించిన విధానంపై కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.
తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఎంపీ అరవింద్ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. విచారణను ఎదుర్కోవాల్సిందేనని.. కిందికోర్టుతో తేల్చుకోవాలని తేల్చిచెప్పింది.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని సూచించింది.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణకు సోహెల్ హాజరు కావాల్సిందే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 16 న పంజాగుట్ట పోలీసుల ముందు షకీల్ కొడుకు సోహెల్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.