Harish Rao: రైతు బంధు ఎప్పుడు వేస్తారు?.. హరీష్ రావు ఫైర్!
రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రైతు బంధు పెంచుతాం అన్నారు.. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను ప్రశ్నించారు.
రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రైతు బంధు పెంచుతాం అన్నారు.. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను ప్రశ్నించారు.
2014 నుంచి డిసెంబర్ 7, 2023 వరకు తెలంగాణ ఫైనాన్స్‌కు సంబంధించి అన్నీ వివరాలతో కూడిన లెక్కలు చెప్పాలని కాంగ్రెస్ మంత్రులు అధికారులను ఆదేశించారు. శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ టార్గెట్‌గానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ, హరీష్ రావు, లోకేష్,చిరు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ కొత్త మంత్రులకు సైతం కంగ్రాట్స్ చెబుతూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
రైతుబంధును కాంగ్రెస్ అడ్డుకుందనే ఆరోపణలపై రేవంత్ రెడ్డి స్పందించారు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు జారీ చేసిందన్నారు. పది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు భరోసాగా రూ.15 వేలు ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు.
రైతు బంధు పంపిణీని ఆపాలని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీఐకి ఫిర్యాదు చేశారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. డిసెంబర్ 3 తర్వాత మళ్లీ కేసీఆరే అధికారంలోకి వస్తారని.. అప్పుడు రైతుల ఖాతాల్లో యథావిథిగా రైతుబంధు డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు ఉండేవని అని అన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ మాటలు నమ్మితే మోసపోవడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
పటాన్చెరులో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ సోదరుడు, వదిన బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీశ్ రావు వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ కంచుకోటల నడుమ ఉన్న దుబ్బాకలో ఎలాగైనా మళ్లీ గెలవాలని రఘునందనరావు సర్వశక్తులూ ఒడ్డుతుండగా, వ్యూహాత్మకంగా తమకు కీలకమైన స్థానాన్ని చేజిక్కించుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. తాజాగా రఘునందన్ కు మద్దతుగా మందకృష్ణ ప్రచారం చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
తమ పార్టీ కోసం రూపొందించిన గులాబీల జెండలే రామక్క సాంగ్ సూపర్ హిట్ అయ్యిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. దీంతో ఈ పాటను కాంగ్రెసోళ్లు కాపీ కొట్టారంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ వాళ్ల దగ్గర అసలు ఉండదని.. అంతా నకిలీనే అంటూ హుస్నాబాద్ ప్రచారంలో నవ్వులు పూయించారు.