TS: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ
తెలంగాణలో 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఉట్నూరు ఏఎస్పీగా కాజల్, ఆసిఫాబాద్ ఏఎస్పీగా ఎస్. చిత్తరంజన్ ను నియమించారు.
తెలంగాణలో 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఉట్నూరు ఏఎస్పీగా కాజల్, ఆసిఫాబాద్ ఏఎస్పీగా ఎస్. చిత్తరంజన్ ను నియమించారు.
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ నెల 19 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఎస్బీఐ, పీఎన్బీ బ్యాంకులో లావాదేవీలను నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ బ్యాంకుల్లో ఉన్న అన్ని ఖాతాలను మూసి వేయాలని ఆర్డర్ పాస్ చేసింది.
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ నేతృత్వం వహించనున్నారు. ప్రస్తుతం అక్కడి పార్లమెంటను రద్దు చేశారు. మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు యూనస్ ప్రభుత్వాన్ని నడిపిస్తారు.
బంగ్లాదేశ్‌లో చెలరేగిన ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకిపోయింది. అల్లర్లలో వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాంతో పాటూ అక్కడి ప్రభుత్వం కూలిపోయింది. ఇదంతా అసలెలా జరిగింది పూర్తి కథనం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆర్డినెన్స్ జారీ చేసింది. మంత్రుల నుంచి ఆన్లైన్లో ఆర్డినెన్స్‌కు ఆమోదం తీసుకుంది. తర్వాత దాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపింది.
మైనారిటీ విద్యార్ధులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలో టెట్ పరీక్ష కోసం మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ కలిపి ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ ప్రకటించారు.
ప్రతి పౌరుడికి ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ హక్కు ఉండడంతో పాటూ పౌరులందరికీ ఇంటర్నెట్ సమాన యాక్సెస్ అందించే బిల్లును ప్రభుత్వం ఆమోదించింది. దీనివలన ఇప్పుడు ఇంటర్నెట్ సౌకర్యాలను యాక్సెస్ చేయకుండా నిరోధించే ఎలాంటి రుసుము లేదా ఛార్జీలను ఎవరూ చెల్లించక్కర్లేదు.
మరికొన్ని రోజుల్లో మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్లు వేస్తోంది. ఈ క్రమంలో డిగ్రీ పాసయితే చాలు పదివేలు ఇస్తామంటూ నిరుద్యోగులకు ఆఫర్ ప్రకటించింది.