GAZA: ఇజ్రాయెల్ మీద హమాస్ ఎదురుదాడి..8 మంది సైనికులు మృతి
హమాస్ ఫైటర్లు జరిపిన దాడిలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ స్వయంగా ధృవీకరించింది. పేలుడు కారణంగా వారు మరణించారని చెప్పింది.
హమాస్ ఫైటర్లు జరిపిన దాడిలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ స్వయంగా ధృవీకరించింది. పేలుడు కారణంగా వారు మరణించారని చెప్పింది.
గాజాలో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సెంట్రల్ గాజాలో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకరపోరు సాగుతోంది. ఇందులో దాదాపు 200 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 400మంది దాకా గాయపడ్డారని సమాచారం.
ఇజ్రాయెల్-హమాస్ పోరులో బలైపోతున్న సామాన్యులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గాజా గడ్డపై నెత్తుటి ప్రవాహానికి కారణం ఎవరు? ఈ విధ్వంసం ఆగేదెప్పుడు? అంతర్జాతీయ సమాజం పాలస్తీనా పక్షాన నిలపడుతుందా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
గాజా శరణార్థి శిబిరంపై ఇజ్రాయేల్ వైమానిక దాడి జరిపింది. ఈ దాడిలో 35 మంది చనిపోయినట్టు చెబుతున్నారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో పది మందికి గాయాలు అయినట్టు అధికారులు ప్రకటించారు.
ఐక్యరాజ్యసమితితో కలిసి గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతి చెందారు. మృతుడు ఐరాసలోని భద్రత, రక్షణ విభాగంలో(DSS) పనిచేస్తున్నారు. రఫాలోని యూరోపియన్ ఆసుపత్రికి వెళ్తుండగా.. ఆయన వాహనంపై దాడి జరిగింది.
ఇరాన్ తో యుద్ధానికి కాలు దువ్వుతున్న ఇజ్రాయెల్ మరోసారి గాజాపై ప్రతీకారం తీర్చుకుంది. రఫాలో శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. 22మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో 18మంది చిన్నారులున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా హమాస్ చేసిన క్షిపణి దాడుల్లో భారతీయుడు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పాలస్తీనా గాజాలోని రఫా నగరంలో సైనికదాడులను నిలిపివేయాలని ఇజ్రాయెల్ను.. చైనా కోరింది. దాడులు ఆపకపోతే మానవతా విపత్తు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులకు హాని కలిగించేలా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని తెలిపింది.
హమాస్ చెరలో అడవిలో జంతువులో ఉన్నాను అంటున్నారు మియా స్కెమ్. అక్టోబర్ 7న ఇజ్రాయెల మీద హమాస్ దాడి చేసి 240 మంది ఇజ్రాయెల్ పౌరులను బంధించింది. అందులో కొంత మందిని 54 రోజుల తర్వాత విడుదల చేసింది. అలా విడుదలైన వారిలో మియా స్కెమ్ ఒకరు.