Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి
దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
TG: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కోచ్‌లో ఎవరూ లేకపోవడంలో ప్రాణ నష్టం తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలోని బెహతా హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఒక ఇంట్లో మంటలు అంటుకోవడంతో ఏడుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. అందులో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. గాయపడిన ఒక మహిళ, ఒక చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.
కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40 మంది భారతీయులు చనిపోయారు. దీని మీద భారత ప్రధాని అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రమాద కారణాలను తెలుసుకున్న ఆయన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని పాతబస్తీ పురానీ హవేలీలో ఎస్కే అనే ఫుట్‌వేర్ షాపులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకంది. ఆ షాపులో ఉన్న చెప్పులు, మూడిసరుకు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది.
కువైట్‌లోని ఓ భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది మృతి చెందగా.. అందులో 40 మంది భారతీయులే ఉండటం కలకలం రేపుతోంది. బుధవారం ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 41 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తడ మండలం మాంబట్టు పరిశ్రమలో వేస్టేజీ అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కెనడాలో.. ఎయిర్ కెనడా అనే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుడివైపు ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి. మంటలను గమనించిన గ్రౌండ్ సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను అప్రమత్తం చేశారు. విమానాన్ని అత్యవసరంగా అక్కడే ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.