ఇంటర్నేషనల్ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం...భయంతో పరుగులు పెట్టిన జనం..!! ఫిలిప్పీన్స్‌లో మిండనావో భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ఇచ్చిన సమాచారం ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. భూకంపం ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. By Bhoomi 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized భారత్ లో రెండుచోట్ల భూకంపం.. భయం గుప్పిట్లో ప్రజలు ఇండియాలో గురువారం రెండు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశీలో తెల్లవారుజామున 2.02 గంటలకు భూమి కంపించగా, ఉదయం 9:34 గంటలకు జమ్మూ కశ్మీర్‌లోనూ ప్రకంపనలు వచ్చినట్లు ఎన్ సీఎస్ అధికారులు తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. By srinivas 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: భారీ భూకంపం.. 140కి చేరిన మృతుల సంఖ్య శుక్రవారం రాత్రి నేపాల్‌లో భూకంపం రావడంతో మృతుల సంఖ్య 140కి చేరింది. వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో రిక్టార్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. By B Aravind 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Big Breaking: ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతాన్ని వణికించిన భారీ భూకంపం. ఢిల్లీ-ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలో భూకంపం సంభవించింది. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్, బీహార్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. నేపాల్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. By Bhoomi 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Afghanistan: అఫ్ఘానిస్థాన్‌ను వణికించిన భారీ భూకంపం..!! అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రజలు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. By Jyoshna Sappogula 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Breaking news: ఢిల్లీని వణికించిన భూకంపం! ఢిల్లీ (Delhi) నగరం భూకంపంతో ( Earth Quake) వణికిపోయింది. భూ ప్రకంపనలు భారీగా రావడంతో ఢిల్లీ నగరం ఒక్కసారిగా హడలిపోయింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎన్సీఆర్ (Ncr) ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై భూకపం తీవ్రత 6.2 గా నమోదు అయ్యింది. By Bhavana 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Earthquake in Bay of Bengal: బంగాళాఖాతంలో బలమైన భూకంపం, సునామీ వస్తుందా? నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఆదివారం అర్థరాత్రి బంగాళాఖాతంలో బలమైన భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం 1:29 గంటలకు ఈ భూకంపం సంభవించింది. భూకంపం లోతు 70 కిలోమీటర్లుగా నమోదైంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్, టిబెట్లలో కూడా భూకంపం రావడంతో భూమి కంపించింది. మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. By Bhoomi 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Morocco Earthquake: 2 వేలు దాటిన మొరాకో భూకంపం మృతుల సంఖ్య, ఎటు చూసిన శవాల దిబ్బలే..!! ఆఫ్రికా దేశం మొరాకో భారీ భూకంపంతో చిగురాకులా వణికిపోయింది. శుక్రవారం అర్థరాత్రి సంభవించిన భారీ భూకంపం ఘటనలో ఇప్పటివరకు రెండువేలకుపై మంది ప్రాణాలు కోల్పోయారు. 2,059మంది గాయపడ్డారు. వీరిలో 1,404మంది పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ మంత్రిత్వశాఖ తెలిపింది. By Bhoomi 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Earthquake In Chhatisgarh : భూకంపం ధాటికి వణికిపోయిన చత్తీస్‌గఢ్..ఇళ్లలో నుంచి పరుగులు పెట్టిన జనం..!! ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం సంభశించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదు అయ్యింది. భూకంప కేంద్రం కోర్బా జిల్లాలోని పసన్ సమీపంలో ఉన్నట్లు సమాచారం.భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఆ ప్రాంతంలోని పలు ఇళ్ల గోడలకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. By Bhoomi 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn