Donald Trump : 100 శాతం పన్నులు విధిస్తా...కెనడాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. చైనాతో కెనడా కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. చైనాతో కెనడా కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న కోరికను ట్రంప్ మరోసారి బయటపెట్టాడు. అమెరికా తప్ప మరే దేశమూ గ్రీన్లాండ్కు రక్షణ కల్పించలేదని అన్నారు. దావోస్ వేదికగా ప్రపంచ దేశాధినేతల సమక్షంలో ట్రంప్ మాట్లాడుతూ.. గ్రీన్లాండ్ అమెరికా భూభాగంగా మార్చుకోవాలన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ప్రస్తుతం ట్రంప్ డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌పై కన్నేశారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో గాజా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించడం కోసం ఇటీవల ట్రంప్ ''బోర్డ్ ఆఫ్ పీస్''ను ఏర్పాటు చేశారు.
గాజాలో శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేసిన శాంతి మండలిలో చేరాలన్న అమెరికా ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తిరస్కరించారు. దీనికి ప్రతిచర్యగా, ఫ్రాన్స్ నుండి అమెరికాకు దిగుమతి అయ్యే వైన్, షాంపైన్లపై 200 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు.
ఫిబ్రవరి 1 నుంచి డెన్మార్క్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, నార్వే, నెదర్లాండ్స్, జర్మనీ, స్వీడన్, యూకే నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం దిగుమతి పన్ను విధిస్తానని ట్రంప్ తేల్చిచెప్పారు. దీంతో EU దేశాలు యాంటీ కోర్సన్ ఇన్స్ట్రూమెంట్ (ACI) ని తెరపైకి తీసుకొచ్చాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ దశాబ్దాల పాలనను అంతం చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. దేశంలో అశాంతికి ఆజ్యం పోస్తున్నారని..దాని వలన ప్రజల ప్రాణాలు పోతున్నాయని అన్నారు.
ఇరాన్లో అనూహ్యంగా పెరిగిన ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వంపై విసిగిపోయిన జనం నుంచి పెల్లుబికిన ఆగ్రహాగ్ని రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. జనం అసంఖ్యాకంగా వీధుల్లోకి వచ్చి బ్యాంక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలు, ఏటీఎంలకు నిప్పు పెడుతున్నారు.
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులను ఉరితీసే చర్యలకు పాల్పడితే అమెరికా అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై ట్రంప్ స్పందించారు.