Israel-Iran War: తగ్గేదే లేదు.. ట్రంప్ కు బిగ్ షాక్.. యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన!

అమెరికా,ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై విరుచుకుపడుతుండగా, ఇరాన్‌ ఏమాత్రం వెనకకు తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌ తో పాటు అమెరికా మిత్ర రాజ్యాలపై దాడులు చేస్తూనే ఉంది. మరోవైపు ఎంత కాలమైనా యుద్ధం చేసే సత్తా మాకుంది. గల్ఫ్‌​ ఫ్యూచర్‌ డిసైడ్‌ చేసేది కూడా మేమే అంటూ ప్రకటించింది.

New Update
Trump

Trump

Israel- Iran War: ఇరాన్‌. ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం మొదలై రెండు వారాలు అయింది. అమెరికా,ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై విరుచుకుపడుతుండగా, ఇరాన్‌ ఏమాత్రం వెనకకు తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌ తో పాటు అమెరికా మిత్ర రాజ్యాలపై డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగా ఇరాన్‌కు చెందిన అతి ముఖ్యమైన నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లతో పాటు కీలక స్థావరాలను నాశనం చేశామని ట్రంప్‌ ప్రకటించాడు. అంతేకాదు, యుద్ధం ముగింపు దశకు చేరుకుందని ప్రకటించారు.  ప్రకటించడం మాత్రమే మిగిలి ఉందని డొనాల్డ్‌ ట్రంప్‌ ఒకవైపు ప్రకటించాడు. కానీ ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. ట్రంప్‌ వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించింది. తమకు ఏమీ కాలేదని, ఇక నుంచి తమ నుంచి ఎదుర్కోబోయే తీవ్ర పరిణామాలను ప్రపంచం చూడబోతుందనే అర్ధం వచ్చేలా ఇరాన్‌ కౌంటర్‌ ఇచ్చింది. అంతేకాదు దీర్ఘకాల యుద్ధానికి కూడా సిద్ధమని ప్రకటించింది.

తమను తక్కువగా అంచనా వేయడం మానుకోవాలని ట్రంప్‌కు డైరెక్ట్‌డగా వార్నింగ్‌ కూడా ఇవ్వడం గమనార్హం. తమతో యుద్ధాన్ని ముగించేది మీరు కాదని, ఆ యుద్ధానికి ముగింపు తామిస్తామంటూ ఇరాన్ స్పష్టం చేసింది. ‘ యుద్ధం ముగించేది మీరు కాదు. మేం.  గల్ఫ్‌​ ఫ్యూచర్‌ డిసైడ్‌ చేసేది కూడా మేమే.  మీపై(అమెరికా-ఇజ్రాయెల్‌) దాడులు చేస్తూనే ఉంటాం పదేళ్లైనా మేం యుద్ధం కొనసాగిస్తాం.. ఎంత కాలమైనా యుద్ధం చేసే సత్తా మాకుంది.’ అని ఇరాన్‌ హెచ్చరించింది. 

కాగా, ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు ఇస్తామని ట్రంప్‌ అన్నారు. ఇరాన్‌పై తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేరడానికి చాలా దగ్గరలో ఉన్నామన్నారు. మరోవైపు అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అంతరాయం కలిగిస్తే ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ట్రంప్‌  వార్నింగ్‌ ఇచ్చి రోజు గడకవముందే ఇరాన్‌ ప్రతీగా సవాల్‌ విసరడం గమనార్హం..

కాగా, అమెరికా, ఇజ్రాయెల్‌లు  ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌  తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌ యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడుతుందన్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం 30 రోజుల్లో హర్మూజ్‌ జలసంధి పూర్తిగా మూతబడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  అదే గనుక జరిగితే ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తప్పదని హెచ్చరించాడు.

Advertisment
తాజా కథనాలు