/rtv/media/media_files/2026/03/11/trump-2026-03-11-09-26-28.jpg)
Iran America War : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు వస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే ఇంధనం రేట్లు పెరగగా మరికొన్ని దేశాల్లో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో యుద్ధం ఆపాలంటూ ట్రంప్ పై ఇతర దేశాలతో పాటు అమెరికాలోనూ ఒత్తిడి పెరుగుతోంది. దీర్ఘకాలం యుద్ధ చేయడం వల్ల మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తుండటంతో యుద్దం ఆపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన సలహాదారులు సైతం ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరిగిపోతున్న చమురు ధరలు, మరోవైపు కొన్ని నెలల్లో అమెరికాలో చట్టసభ సెనేట్ ఎన్నికలున్న నేపథ్యంలో..ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని సలహాదారులు ట్రంప్‌కు సూచించారు. ఇరాన్ తో యుద్ధంతో ట్రంప్ ఇప్పటికే బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇంకా యుద్ధం సాగిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. అందుకే యుద్ధం నుంచి బయటపడే వ్యూహాన్ని అమలు చేయాలని వారు కోరినట్టు సమాచారం.ఈ విషయమై వాల్‌స్ట్రీట్ జర్నల్ తాజాగా కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. యుద్ధం మూలంగా చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిపోయాయి. దీనిపై ట్రంప్ సలహాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. త్వరలో సెనేట్ ఎన్నికలున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ నేతలు ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేరుగా వారు సలహాదారులకు కాల్స్ చేసి యుద్ధంపై ఆరాతీస్తున్నారు. యుద్ధం మొదలుపెట్టిన సమయంలో రిపబ్లికన్ల నుంచి అధ్యక్షుడు ట్రంప్‌నకు భారీ మద్దతు లభించింది. కానీ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో పాటు పార్టీవర్గాల నుంచి మద్దతు తగ్గిపోయే ప్రమాదం ఉందని సలహాదారులు తేల్చి చెప్పారు. అంతేకాదు చాలా మంది అమెరికన్లు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నట్టు పలు సర్వేలు వెల్లడించిన విషయాన్ని సలహాదారులు అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు ఇరాన్ పై భారీగా దాడులు చేస్తు్న్నప్పటికీ ఏ మాత్రం తలొగ్గకపోవడంతో ట్రంప్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే యుద్ధంలో ప్రధాన లక్ష్యాలను సాధించామంటూ వెనక్కి తగ్గే ప్రణాళికను అమలు చేయాలని ట్రంప్‌కు సలహాదారులు సూచించారని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది.
మరోవైపు యుద్ధం మూలంగా ప్రపంచ వ్యాప్తంగా -- ఆర్థిక సంక్షోభం, ముడి చమురు మంటలతో...-- ప్రపంచ దేశాల నుంచి ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో యుద్ధం అయిపోయిందని మొన్నే హింట్ ఇచ్చి మళ్లీ మాట మార్చాడు ట్రంప్, అయితే యుద్ధం ఆపుతారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. అదే సమయంలో ట్రంప్‌ను అంతమొందించే వరకు యుద్ధం ఆగదంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడులు పెంచుతామన్న అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) తీవ్రంగా హెచ్చరించింది. ఏకంగా ఒక టన్ను వార్‌హెడ్ ఉన్న క్షిపణులను ప్రయోగించి, తీవ్ర స్థాయిలో నష్టం చేస్తామని ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మాజిద్ మౌసావి అమెరికాను హెచ్చిరించాడు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌తో తాము కాల్పుల విరమణను కోరుకోవడం లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బఖర్ ఖాలిబాఫ్ పేర్కొన్నారు. తమపై మరోసారి దాడి చేయాలన్న ఆలోచన కూడా వారికి కలగకుండా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Follow Us