ఆంధ్రప్రదేశ్ Another Woman Killed in Elephant Attack: చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు దాడిలో మరో మహిళ మృతి..! చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ఒంటరి మదపుటేనుగు దాడిలో మరో మహిళ మృతి చెందింది. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు బోడి నత్తం గ్రామానికి చెందిన మహిళ వసంత(57) అనే మహిళ ఏనుగు దాడిలో మృతి చెందింది. గురువారం తెల్లవారు జామున వసంత అనే మహిళపై దాడి చేసి చంపేసింది. శ్రీరంగం పల్లి చెరువు నుంచి కుంకి ఏనుగుల ద్వారా అటవీ ప్రాంతంలోకి అధికారులు మళ్లీస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏనుగు వరుసగా దాడి చేస్తూండటంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. By E. Chinni 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Tomato: సామాన్యులకు రిలీఫ్.. పడిపోయిన టమాటా ధరలు గత కొంతకాలంగా హడలెత్తించిన టమాటా ధరలు ఒక్కసారిగా డమాల్ మన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్లో క్వింటా టమాటా వెయ్యి రూపాయలు పలికింది. అనంతపురం, కర్నూల్ జిల్లాల నుంచి దిగుమడి పెరగడంతో రేట్లు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. By Karthik 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పుంగనూరు ఘటనలో 30మందిపై కేసులు.. విచారణకు డీజీపీ ఆదేశాలు ఈ ఘటనపై విచారణ చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్ లను ఆదేశించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని, వాహనాలను సైతం ఉద్దేశ పూర్వకంగా తగల పెట్టారన్నారు. ఈ ఘటనలో రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అందరిపై కఠినమైన శిక్షలు అమలు చేస్తామని వెల్లడించారు డీజీపీ. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నామని, ఇప్పటికే అనేకమందిని గుర్తించామని, మరికొందరి కదలికలపై కూడా నిఘా.. By E. Chinni 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నిరసనలు చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాయలసీమకు మంజూరైన ఎయిమ్స్ వంటి కొన్ని భారీ ప్రాజెక్టులను సైతం అమరావతికి తరలించాడంటూ ధ్వజమెత్తారు. పుంగనూరులో ప్రాజెక్టులు నిలిచిపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణమని ఆరోపించారు. రెండు నీటి ప్రాజెక్టులను పుంగనూరులో ఏర్పాటు చేయకుండా కోర్టు స్టే తెచ్చి నిలిపివేశారని విమర్శించారు. రాయలసీమలో ఒక్క నీటి ప్రాజెక్టుకు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేయలేదని.. By E. Chinni 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లక్కంటే నీదే భయ్యా! టమాట సాగుతో రైతుకు సిరులు ఓ పక్క..టమాట(tomato) ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే..మరోపక్క..టమాటతోనే (Rates) కొంతమంది రైతుల(Farmers) ఇంట్లో సిరులు కురుస్తున్నాయి.మొన్న మహారాష్ట్ర పూణే (Pune)లో ఓ రైతు కుటుంబం టమాట సాగుతో ఏకంగా రూ.కోటిన్నర ఆదాయం పొందారు. తాజాగా ఏపీకి(AP) చెందిన రైతు కుటుంబం రూ.3 కోట్లు(3Crores) ఆర్జించింది.దీంతో సాగు ఖర్చులు,రవాణా,మార్కెటింగ్ ఖర్చులు (Markeing Expenses) పోనూ రూ.3 కోట్లు సంపాదించారు.మొత్తం 22 ఎకరాల్లో టమాట పంటతో మంచి లాభాలను (Profits) ఘటించారు. By Shareef Pasha 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn