వీడియోలు పట్టపగలే చిరుతకు చుక్కలు చూపించిన బబూన్స్ ఐక్యమత్యమే మహాబలం అని ఈ బాబూన్లు మరోసారి రుజువు చేశాయి. ఆకలి తీర్చుకుందామని దాడిచేసిన చిరుతపై అటాక్ చేశాయి. అంతేకాదు ఆ చిరుతకే ముచ్చెమటలు పట్టించి పట్టపగలే చుక్కలు చూపించాయి. బతుకు జీవుడా అంటూ అడవిలోకి పరుగులు తీసిన దృష్యాలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. By Shareef Pasha 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలలో మరో చిరుత హల్చల్.. భక్తులు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు తిరుమల నడకదారిలో మరో చిరుత కలకలం రేపింది. ఓ బాలుడు చిరుతను చూశాను అని చెప్పడంతో.. భక్తులందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురై, అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మళ్లీ చిరుత ఎవరిపై దాడి చేస్తుందోమోనని భయంతో అరుపులు, కేకలు పెట్టారు భక్తులు. నామాలగవి దగ్గర చిరుత కనిపించిందని పులి కనిపించిందని ఆ బాలుడు చెబుతున్నాడు. దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. వెంటనే బాలుడు చెప్పిన తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తున్నారు. బోను చిక్కింది పెద్ద పులి అయి ఉంటుందని, ఇవి దాని పిల్లలు అయి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా భక్తులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn