ఇంటర్నేషనల్ India-Canda: మళ్లీ హీటెక్కిన భారత్, కెనడా వివాదం.. గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్ భారత్లో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకున్నామని అధికారిక ప్రకటన చేసిన కెనడా.. ఇండియాపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో భారత్.. కెనడాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇండియాలోని దౌత్య సిబ్బంది సంఖ్యపై కెనడా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యాలను చూశామని.. ఇక్కడ కెనడాకు చెందిన దౌత్యవేత్తల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొంది. అంతేగాక మన అంతర్గత విషయాల్లో వాళ్లు తరచుగా జోక్యం చేసుకుంటున్నారని.. న్యూఢిల్లీ, ఒట్టావా దౌత్యసంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలనేదే తాము కోరుకుంటున్నామని తెలిపింది. By B Aravind 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అక్కడ ముప్పుతిప్పలు పడుతున్న భారత విద్యార్థులు..చుట్టుముట్టిన కష్టాలు.. నానా ఇబ్బందులు..!! ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య సంబంధాలు గతంలో ఎప్పుడూ లేనంతగా తీవ్రంగా క్షీణించాయి. మరోవైపు, భారత్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత అక్కడి భారత విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్కసారిగా చుట్టుముట్టిన కష్టాల నుంచి బయటపడలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ వివాదంపై బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్.. కెనడా ప్రధాని ట్రూడోతో మాట్లాడారు. భారత్తో తలెత్తిన ఈ ప్రస్తుత వివాదం వీలైనంత త్వరగా ముగుస్తుందని తాను భావిస్తున్నానని జస్టిన్ ట్రూడోతో రిషి సునాక్ పేర్కొన్నట్లు బ్రిటన్ వెల్లడించింది. By Jyoshna Sappogula 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India Canada Row : పరువు పోగొట్టుకున్న కెనడా..మండిపడుతున్న అగ్రదేశాలు..!! కెనడా భారత్తో సత్సంబంధాలను చెడగొట్టుకుంది. ఖలిస్థాన్ ఉగ్రవాదిని హతమార్చడం వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అలాంటి ఆరోపణలను భారత్ ఖండించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. ఇండియా పరువు తీసేందుకు కెనడా చాలానే ప్రయత్నాలు చేసింది. కానీ అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్ కెనడాకు సపోర్టు చేయలేదు. భారత్ విషయంలో కెనడా వైఖరి తప్పని చెప్పకనే చెప్పాయి. భారత్ పరువు తీయాలనుకున్న కెనడా తన పరువు తానే తీసుకున్నట్లయ్యింది. By Bhoomi 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn