PM Modi: రైతులకు రూ.300కే యూరియా.. కామారెడ్డిలో మోదీ!
ఈరోజు కామారెడ్డిలో పర్యటించారు ప్రధాని మోదీ. బీజేపీ హామీ ఇచ్చిందంటే అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు మోదీ. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అన్నారు.
ఈరోజు కామారెడ్డిలో పర్యటించారు ప్రధాని మోదీ. బీజేపీ హామీ ఇచ్చిందంటే అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు మోదీ. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అన్నారు.
16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటే.. వాళ్లకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని మంత్రి కేటీఆర్ అన్నారు.మళ్లీ తాము అధికారంలోకి వస్తే.. సౌభాగ్యలక్ష్మీ పథకం కింద కొత్త పథకాన్ని తీసుకొస్తారని తెలిపారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.3 వేలు అందజేస్తామన్నారు.
తెలంగాణ రాజకీయం అసలసిసలైన చదరంగాన్ని తలపిస్తోంది. జాతీయ, ప్రాంతీయ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. అయితే ఆ ప్రకటనలలోని లబ్ధిదారులు ఫేక్ అని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పై చేయి సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా.. జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తామని హస్తం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయంగా తనను దెబ్బతీయడానికి బీఆర్ఎస్ తండ్రీకొడుకులను విడదీసిందని బీజేపీ అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాబుమోహన్ అన్నారు. ఎన్నికలకు ముందు మంత్రి హరీశ్ రావు తన కొడుకును పార్టీలో చేర్చుకున్నారని, అడిగితే తానే సీటును త్యాగం చేసేవాడినని చెప్పారు.
తెలంగాణలో ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ సరికొత్త ప్రకటన చేశారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం, గృహ లక్ష్మీ పథకాలతో దూసుకుపోతున్నది బీఆర్ఎస్. వడ్డీలేకుండానే హోంలోన్ ఇచ్చేలా కొత్త పథకాన్ని తెస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ నివాసంలో ఎలక్షన్ స్క్వాడ్ సోదాలు చేస్తోంది. ఆయన భారీగా డబ్బు డంపు చేశారనే ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన.. టాస్క్‌ఫోర్స్ అండ్ ఎలక్షన్ స్క్వాడ్ బృందం ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తోంది.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. ప్రచారానికి కొన్ని రోజులే సమయం ఉండటంతో అభ్యర్థులంతా ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. అటు ఎన్నికల సంఘం కూడా తమ పనికూడా పూర్తి చేసే పనిలో పడింది. నవంబర్ 30 జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ఎన్నిలక ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు.