రైతుబంధుకు పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్.. ఈసీకి బీఆర్ఎస్ రిక్వెస్ట్!
‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుబంధు చెల్లింపులకు మళ్లీ అనుమతించాలని ఈసీని బీఆర్ఎస్ కోరింది.
‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుబంధు చెల్లింపులకు మళ్లీ అనుమతించాలని ఈసీని బీఆర్ఎస్ కోరింది.
తెలంగాణలో ఎన్నికల సంఘం సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే రైతుబంధు పంపిణీకి అనుమతిచ్చిన ఎలక్షన్ కమిషన్ తాజాగా దీన్ని ఉపసంహరించుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో రైతుబంధు పంపిణీ పర్మిషన్ను వెనక్కి తీసుకుంది.
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో శనివారం అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి దాడికి పాల్పడ్డట్లు ఫసియుద్దీన్ ఫిర్యాదు చేశారు. పట్నం నరేందర్రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది బీజేపీకే ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ ఖిల్లా రోడ్డులో రోడ్డు షో కేటీఆర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. బీఆర్ఎస్ బీజేపీతో ఎప్పుడూ జత కట్టలేదని, భవిష్యత్తులో కూడా ఆ పార్టీతో దూరంగానే ఉంటామని అన్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 370 ఆర్టికల్ రద్దుని కాంగ్రెస్ అడ్డుకుందని అన్నారు. మోదీ హయాంలో ఆర్టికల్ 370ని రద్దు చేసి దేశ రక్షణలో కీలకంగా వ్యవహరించామని తెలిపారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే అని అన్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే.. సీఎం కేసీఆర్ ఎంతో మేలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారని తెలిపారు. కేసీఆర్ రాష్ట్రం కోసం కొట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారని వ్యాఖ్యానించారు.
ఈరోజు కామారెడ్డిలో పర్యటించారు ప్రధాని మోదీ. బీజేపీ హామీ ఇచ్చిందంటే అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు మోదీ. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అన్నారు.
16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటే.. వాళ్లకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని మంత్రి కేటీఆర్ అన్నారు.మళ్లీ తాము అధికారంలోకి వస్తే.. సౌభాగ్యలక్ష్మీ పథకం కింద కొత్త పథకాన్ని తీసుకొస్తారని తెలిపారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.3 వేలు అందజేస్తామన్నారు.