తడబడుతున్న బీజేపీ.. కంచుకోటలకు బీటలు
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ఈసారి ఆ పార్టీకి చాలా గట్టి షాకే తగిలింది. బీజేపీ కంచుకోట స్థానాలు అయిన పదింటిలో బీజేపీ పార్టీ తమ పట్టును కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ఈసారి ఆ పార్టీకి చాలా గట్టి షాకే తగిలింది. బీజేపీ కంచుకోట స్థానాలు అయిన పదింటిలో బీజేపీ పార్టీ తమ పట్టును కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. 30 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన కాషాయ జెండా ఎగురవేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
ఏపీ అభివృద్ది కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతులు కలపడంతో వారి నాయకత్వంలో రాష్ట్రానికి రానున్న రోజుల్లో మంచి రోజులు రానున్నాయని అంబటి రాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
పాతికేళ్ళుగా ఒడిశాలో ఆపార్టీని ఎవవరూ ఏమీ చెయ్యలేకపోయారు. కానీ ఈసారి బీజేపీ దాన్ని ఛేదించింది. బీజేడీ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళుతోంది.
హిమాచల్ ప్రదేశ్‌లో మండి లోక్‌సభ నుంచి నియోజకవర్గం నుంచి బరిలోకి బాలీవూడ్ నటీ కంగనా రనౌత్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఏకంగా 50,498 ఓట్ల మెజార్టీతో కంగనా ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో వేడుకలు జరుపుకుంటున్నారు.
ఏపీ ఎన్నికల ఫలితాల్లో గేమ్ ఛేంజర్ ఎవరు? ఈ ప్రశ్న ఎవరు వేసినా సమాధానం మాత్రం అందరి నుంచి వచ్చేది పవన్ కల్యాణ్ అనే. ఇంతకీ కూటమి గెలుపుకు పవన్ ఎలా కారణమయ్యారు? పవన్ తీసుకున్న ఏ నిర్ణయాలు కూటమికి ప్లస్‌గా మారాయో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి భారీగా గండి పడింది. యూపీ తమదే అనే ధీమాలో ఉన్న బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఇండియా కూటమి దుమ్మురేపుతోంది. మొత్తం 80 లోక్ సభ స్థానాలుండగా ఇండియా కూటమి 44 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీయే 35 స్థానాల్లో కొనసాగుతోంది.
ఏపీలో బీజేపీ తొలి విజయం సాధించింది. అనపర్తిలో బీజేపీ MLA అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. టీడీపీ నేతగా ఉన్న నల్లమిల్లికి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన కమలం పార్టీ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.