BIG BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడి!
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి చేశారు. తార్నాక లోని ఆర్టీసీ హాస్పటల్ దగ్గరలో ఓ వాహనంపై దూసుకు వచ్చిన సుమారు 50 మంది దుండగులు ఎమ్మెల్యేపై దాడి చేసి పరారయ్యారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి చేశారు. తార్నాక లోని ఆర్టీసీ హాస్పటల్ దగ్గరలో ఓ వాహనంపై దూసుకు వచ్చిన సుమారు 50 మంది దుండగులు ఎమ్మెల్యేపై దాడి చేసి పరారయ్యారు.
సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసు స్టేషన్ ఆవరణలోనే ప్రత్యర్థిని కారుతో ఢీకొట్టి.. హత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది.
గురువారం మెదక్లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు. తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి, మంత్రి వివేక్ పై మక్క బుట్ట విసిరాడు.
ఇజ్రాయెల్, సిరియాల మధ్య ఉద్రిక్తతలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ సిరియాపై చేపట్టిన దాడులకు ప్రధానంగా 8 ప్రధాన కారణాలున్నాయి. ముఖ్యంగా, సిరియాలో అంతర్గత సంఘర్షణలు, ఇరాన్ ప్రభావం, ద్రూజ్ మైనారిటీ రక్షణ వంటి అంశాలు దాడులకు దారితీస్తున్నాయి.
అమెరికాలో దాడి, దొంగతనం లేదా దోపిడీకి పాల్పడితే కఠినమైన శిక్షలతో పాటూ వీసాను రద్దు చేస్తామని యూఎస్ ఎంబసీ హెచ్చరించింది. ఇల్లినాయిస్ లోని టార్గెట్ స్టోర్లో ఒక భారతీయ మహిళ దొంగతనం పట్టుబడిన తర్వాత ఈ హెచ్చరికను జారీ చేసింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా క్యూన్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. తిరిగి కవిత ఇంటిపై మల్లన్న వర్గం దాడి చేస్తుందనే ప్రచారంతో కవిత ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
పాకిస్తాన్ పై బెలూచిస్తాన్ తీవ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా BAM పేరుతో మూడు రోజుల పాటూ జరిపిన దాడుల్లో పాకిస్తాన్ కు చెందిన 50 మంది సైనికులు, తొమ్మిది మంది ఐఎస్ఐ ఏజెంట్లు మరణించారు.
గత కొంతకాలంగా మయన్మార్ లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. సైన్యం,ప్రజాస్వామ్య అనుకూల శక్తుల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. ఈ క్రమంలో నిరాశ్రయులైన ప్రజలు స్థానికంగా ఒక మఠంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ మఠంపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో 23 మంది మరణించారు.